మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,650 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,710 వద్ద ఉన్నది. బంగారం ధరలు స్థిరంగా ఉంది. బంగారం ధరలతో పాటుగా వెండి కూడా స్థిరంగా ఉంది. కిలో వెండి 74,100కి చేరింది.