అల్వాల్ పీఎస్ పరిధి హస్మత్ పేట్ సత్య సాయి ఎంక్లేవ్ లో మంగతాయారు 72 వృద్దురాలును దారుణంగా హత్య చేసాడు ఇంట్లో కిరాయి ఉంటున్న వ్యక్తి. బాత్రూమ్ లో మృతదేహాన్ని దాచిపెట్టాడు నిందితుడు. నిన్న సాయంత్రం మంగతాయారు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి వెతకడం మొదలు పెట్టిన పోలీసులు… రాత్రి సమయంలో అదే ఇంట్లో మూడవ అంతస్తులో కిరాయికి ఉంటున్న సురేష్ ఇంట్లోని బాత్రూమ్ లో…
దేశం కరోనా మహమ్మారి నుంచి క్రమంగా కోలుకుంటోంది. రెండోదశ వేవ్ నుంచి బయటపడతుండటంతో అనేక రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. సాధారణ జీవనం తిరిచి ప్రారంభం కావడంతో మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్నాయి. ఈ మార్కెట్ల ప్రభావం బంగారం ధరలపై పడింది. గతంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా పెరిగిపోయి బంగారం ఇప్పుడు దిగి వస్తున్నది. ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. Read: దుమ్మురేపుతున్న “సిగ్గెందుకురా మామ” సాంగ్ ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.…
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జూన్ 19 వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరిగి పాఠశాలలను ప్రారంభించేందుకు సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నది. జులై 1 వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నట్టు సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. దీనిపై ఈరోజు విచారణ జరిగింది. Read: ప్రామిసింగ్ గా ‘హీరో’ టీజర్! పాఠశాలల…
రంగురాళ్ల బిజినెస్ ముసుగులో హవాలా దందా చేస్తున్న గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రాలజిస్ట్ గా చెప్పుకుంటున్న మురళీకృష్ణ ఇంట్లో ఈనెల 15 వ తేదీన దొంగతనం జరిగింది. రూ.40 లక్షల విలువచేసే జాతిరత్నాలు ఛోరికి గురయ్యాయని మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రంగురాళ్ల ముసుగులో నకిలీ కరెన్సీ దందా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక మురళీకృష్ణ ఇంటో దొంగతనం చేసిన ఆరుగురు దొంగలను అదుపులోకి తీసకొని విచారించగా విషయం బయటపడింది. ఈ…
ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై హైదరాబాద్ సీసీఎస్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. పలు ప్రైవేటు బ్యాంకుల నుండి రుణాలు తిరిగి చెల్లించలేదంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అందింది. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న అప్పు వాయిదాలు చెల్లించడం లేదని బ్యాంకులు ఆరోపణ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే రుణాలు తీసుకుని చెల్లించలేదంటూ హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. షేర్లను తనఖా పెట్టి రెండు బ్యాంకుల్లో కలిపి రూ.460…
పసిడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం నుంచి బంగారం ధర పతనమవుతూ వస్తోంది. తాజాగా బుధవారం బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,100 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,110 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 73,000 గా వుంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 44,100 ఉండగా.. 24…
నేటి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయాయి. మొదటి విడతగా లింగంపల్లి నుంచి ఫలక్ నుమా, ఫలక్ నుమా నుంచి లింగంపల్లి వరకు వీటిని నడపనున్నారు. ముందుగా 10 ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నారు. క్రమంగా ఎంఎంటీఎస్ సర్వీసులను పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ప్రతి రోజూ 10 ఎంఎంటీఎస్ రైళ్లు మాత్రమే నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఫలక్‌నుమా…
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.. టాంజానియా దేశస్తుడి దగ్గర రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్ గుర్తించారు.. హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలిస్తున్న జాన్ వియమ్స్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు… కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. దోహా నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకొచ్చిన జాన్… ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. వారం రోజుల క్రితం…
కరోనా కారణంగా దాదాపు ఏడాదిన్నర కాలంగా షెడ్లకే పరిమితమైన లోకల్ ట్రైన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 2020 మార్చి 16 నుంచి ఎంఎంటీఎస్, సాధారణ రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ వచ్చేవారం నుంచి 10 ఎంఎంటీఎస్‌లు నడపడానికి అనుమతిచ్చింది. ఎంఎంటీఎస్ సేవలను పునఃప్రారంభించడానికి అంగీకరించిన పీయూష్ గోయల్‌కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతానికి 10 రైళ్లు మాత్రమే అందుబాటులోకి రానున్నా మున్ముందు పరిస్థితులను బట్టి వాటిని పెంచే అవకాశం…
జూన్ 19 వ తేదీతో లాక్డౌన్ ముగియడంతో 20 వ తేదీనుంచి ఎలాంటి పొడిగింపు లేకుండా లాక్డౌన్ ను పూర్తిగా ఎత్తివేశారు. ఆదివారం నుంచి లాక్డౌన్ ఎత్తివేయడంతో నగరంలోని ప్రజలు రోడ్డుమీదకు వచ్చారు. దాదాపు నెల రోజులుగా ఇంటికే పరిమితమైన ప్రజలు, లాక్డౌన్ ఎత్తివేయడంతో నగరంలోని ప్రముఖ ప్రదేశాలను కుంటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు ఆసక్తి చూపించారు. నక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినిపార్క్, గోల్కొండ కోట ప్రజలతో కిటకిటలాడింది. ఇక చార్మినార్‌లో మరింత సందడి వాతావరణం…