గత నాలుగు రోజుల క్రితం రాజేంద్రనగర్ హైదర్‌గూడలో అదృశ్యమైన బాలుడు అనీష్ కుమార్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అనీష్ కుమార్ ది ముమ్మాటికి హత్యేనని అంటున్నారు.గురువారం మధ్యాహ్నం అదృశ్యమైన అనీష్ కుమార్ కోసం చుట్టు పక్కల మొత్తం వెతికారు. బాలుడి మృతదేహం లభించిన నీళ్ల కుంట వద్ద కూడా పోలీసులతో ముందు రోజే గాలించారు. అక్కడ బాలుడికి సంబంధించిన ఏలాంటి ఆనవాలు లభించలేదు. కానీ మరుసటి రోజు మృతదేహం నీళ్ల…
అత్తాపూర్ ఎమ్ ఎమ్ పహాడీలో తల్లితో పాటు ఇద్దరు పిల్లల మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లి అమ్రీన్, పిల్లలు అక్సా బేగం, అజా బేగం కనిపించకుండా పోయారు. వారు ఎంతకీ వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో సమీప బంధువులకు ఫోన్ చేసి వాకబు చేశాడు భర్త అభరార్. చుట్టూ పక్కల తీవ్రంగా గాలించిన భర్త. ఎక్కడా వాళ్ల ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో భార్యా పిల్లలు…
హైదరాబాద్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ కి మంచి డిమాండ్ ఉన్నది. కేవలం హైదరాబాద్ కు మాత్రమే కాకుండా ఇక్కడి నుంచి వివిధ రాష్ట్రాలు, దేశాలకు కూడా ఈ బిర్యానీ ఎగుమతి అవుతుంటుంది. అయితే, భాగ్యనగరంలో ఈ బిర్యానీ ఒక్కటి మాత్రమే కాదు. ఎన్నో రకాల వంటకాలు ఫేమస్ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. లెగ్‌పీస్ జాయింట్ పీస్ బిర్యానీ. డొన్నె బిర్యానీ, ఫ్రైడ్ పీస్ బిర్యానీ, మండీ బిర్యానీ, ఇందులో డొన్నె…
హైదరాబాద్‌లో ఈనెల 25న ఉదయం 10 గంటలకు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్లీనరీ సమావేశాన్ని అంగరంభ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భాగ్యనగరం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరంలో జరిగే ఈ సమావేశానికి వచ్చే రహదారులన్నీ టీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలతో…
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఔదార్యం చూపించారు. మెగా అభిమానుల క్షేమం కోసం పరితపించే ఆయన.. తాజాగా ఓ అభిమానికి అండగా నిలిచారు. విశాఖకు చెందిన వెంకట్ అనే మెగా అభిమాని కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలని ఆకాంక్షించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. పలువురు అభిమానులు మెగాస్టార్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన మెగాస్టార్ చిరంజీవి సదరు అభిమాని తనను కలవొచ్చని తెలిపారు. అయితే అభిమాని వెంకట్…
మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. ఇక తాజాగా మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 35 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.24 చేరగా.. లీటర్…
తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల భద్రత కోసం షీ టీంలు పనిచేస్తున్నాయి. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న వేధింపులను నియంత్రించడానికి సైబర్ ల్యాబ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా సెల్ఫోన్ల ద్వారా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌తో వేధించే వారిని ఈ సైబర్‌ల్యాబ్ పసిగడుతుంది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లకు ఈ ల్యాబ్ సాంకేతిక సహాయాన్ని అందజేయనుంది.…
గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా ‘బరోడా కిసాన్ పక్వాడా’ 4వ ఎడిషన్ ప్రారంభించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. 16 జోనల్ ఆఫీసుల పరిధిలో సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ (CAMP) ప్రారంభించింది బ్యాంకు. భారతదేశపు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంకు ఆఫ్ బరోడా (BoB) ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా నేడు బరోడా కిసాన్ దివాస్‌ను ఘనంగా ప్రారంభించింది. రైతులతో పక్షం రోజుల పాటు నిర్వహించే బరోడా కిసాన్ పక్వాడా…
మహిళల సంరక్షణలో తెలంగాణ నెంబర్‌వన్ గా ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బంజరాహిల్స్‌లోని మిథాలినగర్లోని సఖీ సెంటర్‌కు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, ఎమ్మెల్సీ వాణి దేవి, ఎమ్మెల్యే శ్రీ దానం నాగేందర్‌తో కలిసి శంకుస్థాపన చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందన్నారు. మొన్ననే సీఎం కేసీఆర్ గంజాయి నిర్మూలన కోసం సమీక్ష నిర్వహించి చర్యలు…