కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి.. కన్న కూతురిపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్ కోర్టు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్టేషన్ పరిధిలో 2018లో కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడాడో కిరాతకుడు.. అయితే, ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువరించింది ఎల్బీ నగర్ కోర్టులు.. నిందితుడికి 15 సంవత్సరాల జైలుతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.. ఇక, 2018లో ఈ కేసు వెలుగు చూడగా.. బాధితురాలితో పాటు తన చెల్లెకు 6 లక్షల చొప్పున పరిహారం చెల్లించి.. ఇద్దరు చిన్నారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలిచిన సంగతి తెలిసిందే.