భాగ్యనగరంలో జరుగుతున్న సదర్ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. కనిపించిన వారిని కనిపించినట్టు కుమ్మేసింది. ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో ఈ సంఘటన జరిగింది. దాన్ని కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. జనంపై దూసుకెళ్లిన దున్నపోతు… స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. చివరికి కొందరు యువకులు ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతును పట్టుకున్నారు. కాగా.. హైదరాబాద్ మహా నగరం లో సదర్ పండుగ…
మొన్నటి దాకా దాదాపు కొన్ని నెలలుగా హుజురాబాద్ ఎలక్షన్‌తో బీజీ బీజీగా ఉన్న హరీష్ రావు శుక్రవారం సిద్ధిపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.12 గంటలు 12 కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని టీఆర్ఎస్ పార్టీ శ్రేణు ల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. అటు ప్రజల మధ్య…ఇటు ప్రగతి కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపారు మంత్రి హరీష్. ” నాయకుడు అనే పదానికి కొత్త అర్థం చెప్పడంలో మంత్రి హరీష్…
సదర్ ఉత్సవాలకు ముస్తాబవుతున్న వేళ ఓ దున్నపోతు వీరంగం చేసింది. ఖైరతాబాద్ చౌరస్తా లో దున్నపోతు గంట సేపు హల్ చల్ చేసింది. సదర్ ఉత్సవాలకు ముస్తాబు చేస్తుండగా తాడు తెంపుకొని పరుగు తీసింది ఓ దున్నపోతు. రోడ్డుపై వున్న స్కూటీనీ కొంత దూరం లాక్కెళ్లి పోయింది దున్నపోతు. దీంతో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎట్టకేలకు దున్నపోతును బంధించారు యాదవులు. ఏటా దీపావళి అనంతరం హైదరాబాద్ లో సదరు ఉత్సవం నిర్వహించడం…
జూబ్లీహిల్స్‌లోని హెచ్అండ్ఎం బట్టల షోరూంలో దారుణం చోటు చేసుకోవడంతో ఆ షోరూంకి వెళ్ళాలంటేనే యువతులు భయపడుతున్నారు. ఈ షోరూంపై కేసు నమోదు కావడంతో హెచ్ అండ్ ఎం షోరూం క్లోజ్ చేశారు నిర్వాహకులు. ట్రయల్ రూమ్‌లో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయల్ రూం నుంచి ఇద్దరు యువకులు మొబైల్ ఫోన్ ద్వారా ఆమె నగ్నఫోటోలను తీసేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని పసిగట్టిన యువతి.. చాకచక్యంగా వ్యవహరించి ఆ ఇద్దరి గురించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.…
టెక్నాలజీ మనుషులకు సుఖాలతో పాటు కష్టాలను కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా కొందరు టెక్నాలజీని ఉపయోగించి దారుణాలకు పాల్పడుతున్నారు. మొబైళ్ల ద్వారా వీడియో షూట్లు చేసి బెదిరింపులకు పాల్పడటం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ నగరంలో జరిగింది. జూబ్లీహిల్స్‌లోని హెచ్అండ్ఎం బట్టల షోరూంలో దారుణం చోటు చేసుకుంది. Read Also: వీళ్లు మనుషులేనా? బాలికపై అత్యాచారం చేసిన తండ్రీకొడుకులు ట్రయల్ రూమ్‌లో ఓ యువతి బట్టలు మార్చుకుంటుండగా పక్క ట్రయల్…
మంచిరేవుల ఫామ్ హౌస్ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.. సుమన్ రెండు రోజుల కస్టడీ ముగియడంతో.. ఇవాళ ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు.. దీంతో.. గుత్తా సుమన్ ను మరోసారి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.. ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు నార్సింగ్ పోలీసులు… మరోవైపు.. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగనున్నాయి.. ఇక, ఫామ్‌హౌస్…
హైదరాబాద్ ఓల్డ్‌సిటీ ఛత్రినాక పేలుడు కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది.. టపాసులతో పాటు కెమికల్ పెట్టి మరీ యువకులు పేల్చినట్టుగా పోలీసులు గుర్తించారు. గుంతలో టపాసులు పెట్టిన.. కొందరు యవకులు.. దానితో పాటు కెమికల్స్ మిక్స్ చేశారు. గుంతలో కెమికల్స్, టపాసులు కలవడంతో పేలుడు తీవ్రత పెరిగింది.. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.. ఇక, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించారు. కాగా, ఛత్రినాక…
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. టపాసుల మోత మోగాల్సిందే.. చిన్నా, పెద్ద ఇలా ఇంటిల్లిపాది కలిసి పటాకులు కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటారు.. అయితే, అవి ప్రమాదాలు తెచ్చిపెట్టే సందర్భాలు అనేకం.. ముఖ్యంగా.. కంటి సమస్యలకు దారి తీస్తున్నాయి.. టపాసులు కాల్చే సమయంలో.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా చిన్నపిల్లలు.. పెద్దల పర్యవేక్షణలో బాణాసంచా కాల్చితే మంచిదంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నా.. నిర్లక్ష్యంగా టపాసులు కాల్చి ఇబ్బందులు పడుతూ.. ఆస్పత్రికి క్యూ కడుతున్నారు బాధితులు.. ఇక, హైదరాబాద్‌లో…
బంగారం… ఎప్పుడూ డిమాండ్ ఉండే వస్తువు. ముఖ్యంగా మన దేశం లో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఏ సీజన్ అయినా.. బంగారం వ్యాల్యూ మాత్రం అస్సలు పడిపోదు. అయితే… గత కొన్ని రోజులుగా మన దేశం లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ. 48 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,550…
హైదరాబాద్ అంబర్ పేట్ లోని పాత పుస్తకాల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది… సుమారు ఒంటి గంట ప్రాంతంలో షాపులో మంటలు చెలరేగినట్టు స్థానికులు చెబుతున్నారు… సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేసారు… పుస్తకాలు షాపు కావడంతో మంటలను అదుపుచేయటం ఫైర్ సిబ్బందికి కష్టతరం అయింది.. దీపావళి టపాసుల వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇది ఇలా ఉండగా.. అటు హైదరాబాద్‌లో దీపావళి వేడుక విషాదాన్ని మిగిల్చింది. ఛత్రినాక పోలీస్…