ప్రముఖ ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ “ప్లగ్ అండ్ ప్లే” భారతదేశంలో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో “ప్లగ్ అండ్ ప్లే” సంస్థ నాయకత్వ బృందం సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఫ్రెంచ్ ప్రభుత్వం బిజినెస్ ఫ్రాన్స్‌లు నిర్వహిస్తున్న “యాంబిషన్ ఇండియా” ఈవెంట్ సందర్భంగా ఈ సమావేశం జరిగింది. అతి పెద్ద ఎర్లీ స్టేజ్ ఇన్నోవేటర్ గా, ఆక్సిలరేటర్ గా,…
ఎంతో చక్కని కుటుంబంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఒక పక్క భార్యతో గొడవలు.. ఇంకోపక్క ప్రియురాలిని వదిలి ఉండలేక ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్, చందా నగర్ కి చెందిన సాయి నవీన్ ని నాలుగేళ్ళ క్రితం కూకట్ పల్లి కి చెందిన యువతితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉండగా.. ప్రస్తుతం అతని భార్య గర్భవతిగా ఉంది. ఇక ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొద్దీ రోజుల…
పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా నగరంలో ఎక్కడో ఒక చోట వ్యభిచార దండాలు నడుస్తూనే ఉన్నాయి. అమాయకులైన ఆడపిల్లలకు డబ్బు ఆశచూపి ఈ రొంపిలోకి దింపుతున్నారు. తాజాగా కూకట్ పల్లిలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు రైడ్ చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వివరాలలోకి వెళితే హైదరాబాద్ కేపీహెచ్‌బీకాలనీలోని రోడ్డు నెంబర్ 4 లో గల ఒక ఇంటిని బి.రాజు, నూర్‌పాషా కాసింబీ అనే ఇద్దురు వ్యక్తులు అద్దెకు తీసుకున్నారు. కొన్ని రోజుల…
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పోలీసులు భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. వెయిటింగ్ హాలులో అనుమానంగా సంచరిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సికింద్రాబాద్ మీదుగా ముంబైకి గంజాయి మోనార్క్ ఎక్స్‌ప్రెస్ ద్వారా రవాణా చేస్తోంది. ఈ ముఠాలో ఒడిశాకు చెందిన ఇద్దరు, ముంబైకి చెందిన ఇద్దరు ఉన్నారు. నిందితుల నుంచి 16 లక్షల రూపాయలు విలువ చేసే 54 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. Read Also: ఆగని బాదుడు.. ఈరోజు కూడా పెరిగిన…
పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు ఇప్పట్లో బ్రేక్ పడే దాఖలాలు కనిపించడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఎలా ఉన్నా… దేశీయ మార్కెట్లో మాత్రం పరుగులు పెడుతున్నాయి. రోజూవారీ ధరల పెంపు కారణంగా పెట్రోల్ ధరలు అడ్డూ, అదుపు లేకుండా పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. శనివారం పెట్రోల్ ధర 36 పైసలు పెరగడంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.36కి చేరింది. అటు…
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను తన భర్త, అతడి కుటుంబసభ్యులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్ధనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని భర్త వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. 2016లో తమ వివాహమైన నాటి నుంచి వేధింపులు కొనసాగుతున్నాయని వాపోయింది. మరోవైపు కులం పేరుతో తన భర్త కుటుంబసభ్యులు దూషిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. Read Also: వైరల్: పెళ్లి వేడుకల్లో అనుకోని అతిథి… జనాల పరుగులు కాగా…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బ్రేక్ వేసింది.. ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది… పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది.. కాగా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద నిర్మిస్తున్నారు. దీనికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది…
ఇండియాలో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 44, 950 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 220 పెరిగి రూ. 49, 040 కి చేరింది. ఇక అటు వెండి ధరలు మాత్రం కాస్త…
రాష్ట్రంలో కొత్తగా 24 గంటల్లో 38,373 నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా మరో 171 కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,71,000లకు చేరుకుంది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,952కు చేరింది. మహామ్మారి నుంచి నిన్న 208 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,126 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరింది. వచ్చే…
హైదరాబాద్ నగరంలో పోలీసులు గంజాయిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా సిటీ మొత్తం పోలీసులు జల్లెడ పడుతున్నారు. టూవీలర్‌పై వెళ్తున్న కొంతమంది యువకులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. యువకుల మొబైల్ చాటింగులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో తమ ప్రైవసీకి పోలీసులు భంగం కలిగిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. నిందితుల కదలికలు, నేరస్థుల అనుచరులపై నిఘా పెట్టేందుకే పలువురి మొబైల్…