హైదరాబాద్ ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం ఉందని కేసీఆర్ గుర్తించుకోవాలని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లంకను కూల్చుతాం.. రామ రాజ్యం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలు చేయాలన్నారు.
హుజురాబాద్ ఉపఎన్నిక ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముం దుందని తరుణ్ చుగ్ అన్నారు. ఆలీబాబా 40 దొంగల మాదిరి కేసీ ఆర్ క్యాబినేట్ రాష్ట్రాన్ని దోచుకుంటుందని తరుణ్ చుగ్ ఆరోపిం చారు. మోడీ ఆశీర్వాదంతో త్వరలో తెలంగాణలో రామరాజ్యం రాబో తుందని ఆయన హితవు పలికారు. కేసీఆర్ సంపాదించిన ప్రతి రూపా యి ప్రజలదేనని ఆయన దానికి లెక్కచెప్పాల్సిన అవసరం ఉంద న్నారు. కేసీఆర్ అహంకారంతో పరిపాలన చేస్తున్నాడని తరుణ్ చుగ్ అన్నారు.