దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.114కి చేరడంతో వాహనాలలో పెట్రోల్ పోయించాలంటే మిడిల్ క్లాస్ ప్రజల జేబులు ఖాళీ అయిపోతున్నాయి. అయితే పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పెట్టిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరల నుంచి ప్రజలు ఉపశమనం పొందాలంటే ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ ఆ ట్వీట్లో కోరారు. అంతేకాకుండా హీరో మహేష్ బాబు…
తెలంగాణలో తాజాగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నేతల పైరవీలు, ఆశవాహుల ఎదురు చూపులతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఒక మినీ యుద్ధమే నడుస్తుందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఆయా నేతలు తమ కంటే తమకు అని నేతలు ఎవరికి వారే పోటీ పడుతున్నారు. ప్రస్తుతం శాసనసభలో ఒక నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 120 స్థానాలు ఉండగా, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ ఖాళీ అయింది.…
హైదరాబాద్ నాంపల్లిలో రెండు హత్యలు కలకలం రేపాయి. రోడ్డుపై భిక్షాటన చేసేవారిని హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. మొదట హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి తలపై రాయితో మోది హత్యకు పాల్పడ్డారు నిందితులు. అలాగే, నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తిని కూడా రాయితో తలపై బాది చంపేశారు. రెండు సంఘటనల్లో ఇద్దరిని హతమార్చిన వ్యక్తి ఒక్కడే అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సీసీ…
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. మితిమీరిన వేగంతో వాహనాలను నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ రోడ్డుపై కారు బీభత్సం కలిగించింది. 120 పిల్లర్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టి రోడ్డు పై పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది ఓ కారు. దీంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా కారు పడి పోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్…
ప్రపంచాన్ని శాసించే పదునైన ఆయుధం.. డబ్బు. అందరు ఈ డబ్బు కోసమే పరితపిస్తుంటారు. ఇంకొంతమంది డబ్బు కోసం కక్కుర్తి పడి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. కేవలం ఒక వంద రూపాయల కోసం కక్కుర్తిపడి ఒక వార్డు బాయ్ చేసిన నిర్వాకం ఒక చిన్నారి ప్రాణం తీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా ఊపిరితిత్తులలో సమస్యతో బాధపడుతున్నాడు. ఈ…
పచ్చని కాపురాలలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ప్రేమించిన వారే మరొకరి మోజులో కట్టుకున్న వారిని హతమారుస్తున్నారు. తాజాగా ఒక భార్య, ప్రియుడి మీద మోజు తో కట్టుకున్న భర్తను అతికిరాతకంగా హతమార్చింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. రాజేంద్రనగర్, శివరాంపల్లికి చెందిన షేక్ ఆదిల్ అలియాస్ నరేష్ (35) పాల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య జోయాబేగం సైదాబాద్ మోయిన్బాగ్లో నివాసముంటోంది. భర్త తరుచూ…
ప్రేమ, పెళ్లి ఎప్పుడు ఎవరితో జరుగుతాయి అనేది మన చేతిలో ఉండదు. మనసు ఎవరిని కోరుకుంటుందో వారితోనే జీవితాంతం నడవాలనుకుంటాం. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా.. ప్రస్తుత సమాజంలో పెళ్ళికి లింగ బేధం అడ్డు కావడం లేదు. ఇంకా చెప్పాలంటే స్వలింగ సంపర్కుల సంబంధం అనేది లీగల్ కూడా అయ్యింది. ఎన్నో దేశాలలో ఇద్దరు ఆడవారు, ఇద్దరు మగవారు పెళ్లి చేసుకొని తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పటివరకు మన దేశంలో చాలా చోట్ల…
మీరు మటన్ ప్రియులా. అయితే తస్మాత్ జాగ్రత్త. తాజాగా గొర్రెలకు అంత్రాక్స్ వ్యాధి సోకుతుండటంతో… నాన్ వెజ్ ప్రియులు అలర్ట్గా ఉండాల్సిందే. ఇన్ని రోజులు మాంసం ప్రియులను బర్డ్ ఫ్లూ వణికించగా.. ఇప్పుడు ఆంత్రాక్స్ కలవరపెడుతోంది. అంత్రాక్స్ సోకిన గొర్రె మాంసంతో వండిన మటన్ తిన్నారో.. మీకూ రోగాలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు. తెలంగాణ వ్యాప్తంగా ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో ఇటీవల నాలుగు గొర్రెలు ఆంత్రాక్స్ వ్యాధితో మృత్యువాతపడ్డాయి.…
హైదరాబాద్లో పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టిసారించింది. ప్రాపర్టీ ట్యాక్సులు కట్టకపోతే బిల్డింగులు సీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. గత ఏడాదిలో వసూలైన పన్నుల కంటే అధికంగా రాబట్టాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్లో..ఆస్తి పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్న బకాయిదారులపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. ట్యాక్స్ చెల్లించకుంటే భవనం సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ రెడ్ వారెంట్ జారీ చేయనుంది. ఆస్తి పన్ను ఎగ్గొడుతూ, పన్ను కట్టకున్నా ఏం కాదులే అనుకునే వారికి ఈ నిర్ణయంతో..GHMC…
హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కేవలం వంద రూపాయల కోసం వార్డుబాయ్ ఘోరానికి ఒడిగట్టాడు. అతడి బాలుడి ప్రాణం తీశాడు వార్డ్ బాయ్. ఎర్రగడ్డకు చెందిన మహ్మద్ ఆజం కుమారుడు మహ్మద్ ఖాజా కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. మూడు రోజుల క్రితం నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని చూసిన వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించాలన్నారు. బాలుడికి ఆక్సిజన్ పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అక్కడే మరో రోగి చికిత్స అందుకుంటున్నాడు.…