భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గినా.. ఇతర దేశాల్లో మళ్లీ భారీగా కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో.. థర్డ్ వేవ్ తప్పదా? అనే ఆందోళనకు నెలకొన్నాయి.. ఓవైపు కోవిడ్ పోయిందనే భావనతో నిబంధనలు సడలిస్తూ వస్తున్న సమయంలో.. మళ్లీ మహమ్మారి విరుచుకుపడుతుందేమోన్న టెన్షన్ వెంటాడుతోంది. ఇక, కరోనా బారినపడుతున్నవారిలో యువతే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 20 ఏళ్లలోపు యువతే 90,561 మంది ఉన్నారని పేర్కొంది. పదేళ్లలోపు…
దేశవ్యాప్తంగా రోజురోజుకు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి జాబితా పెరిగిపోతోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు కేటుగాళ్లు మాత్రం ట్రాఫిక్ నియమాలను పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ జంట ఫోటోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల విభాగం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సదరు ఫోటోలో బైక్ వెనుక కూర్చున్న మహిళ తన తలకు హెల్మెట్ ధరించడానికి బదులు పాలిథిన్ కవర్ను చుట్టుకుంది. Read Also: ఖేల్…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. అక్కడ అంత డబ్బు పంచుతున్నారాట.. ఈ బ్రాండ్ లిక్కర్ ఇస్తున్నారట అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక, ఈ ఎన్నికలపై బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయట.. అయితే, హుజురాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం ఇప్పుడు మానవ హక్కుల కమిషన్కు చేరింది.. డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియగా.. రాజకీయ పార్టీల అభ్యర్థులు…
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ‘లైగర్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ముంబైలో ఈ మూవీ కోసం సాంగ్ పిక్చరైజేషన్ ప్రారంభించారు. ఇటీవల ‘రొమాంటిక్’ మూవీ ప్రీ రిలీజ్ కు వరంగల్ వచ్చిన పూరి, ఛార్మి, విజయ్ దేవరకొండ తిరిగి ముంబైకి చేరుకుని, ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. అయితే… ఈ రోజు ముంబై నుండి పూరి జగన్నాథ్, ఛార్మి తిరిగి హైదరాబాద్ వస్తున్నారు. పూరి తనయుడు ఆకాశ్ పూరి నటించిన…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో పలువురు జోనల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. అయితే ఈ బదిలీల్లో ట్విస్ట్ చోటుచేసుకుంది. కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత మరోసారి తన స్థానాన్ని వదులుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కూకట్పల్లిని వీడేందుకు మమత విముఖత చూపారు. దీంతో ఆమెను కూకట్పల్లి జోనల్ కమిషనర్గానే కొనసాగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. Read Also: రెండు రోజుల పాటు నీటి సరఫరా…
హైదరాబాద్ మెట్రో రైలులో ఓ గర్భిణీ మహిళ కింద కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో మెట్రో రైలులో ప్రయాణించే వారికి కనీసం మానవత్వం లేదా అనే కామెంట్లను పెడుతున్నారు. మనిషి అన్న తర్వాత ఇతరుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరుతున్నారు. అయితే ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశమే లేదని ఓ ట్వీట్ ద్వారా ఆయన స్పష్టం చేశారు. Read Also: షర్మిల…
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో ఈనెల 29, 30 తేదీల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగనుంది. మంజీరా ఫేజ్-2 పైపులైన్లకు మరమ్మతులు నిర్వహిస్తున్న కారణంగా నీటి సరఫరా బంద్ కానుందని జలమండలి ప్రకటించింది. కలగ్గూర్ నుంచి పటాన్ చెరువు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్పీ పంపింగ్ పైప్లైనుకు సంబంధించి వివిధ ప్రాంతాలలో లీకేజీలను నివారించేందుకు మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల…
తెలంగాణ గడ్డపై మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ కుమార్… రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. అందులో భాగంగా ఇవాళ హైదరాబాద్లో తన మద్దతు దారులతో సమావేశం అయ్యారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే ప్రధాన డిమాండ్తో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు వినయ్.. ఈ ఏడా డిసెంబర్లో కొత్త పార్టీ పేరును ,…
ఇండియాలో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వచ్చిన.. పసిడి ధరలు ఇవాళ కూడా ఎగిసి పడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 45, 200 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 220 పెరిగి రూ. 49, 150 కి చేరింది. అయితే… బంగారం ధర పెరిగితే…వెండి ధరలు మాత్రం…
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాలలో కోట్లలో అభిమానులు ఉన్నారు. దీంతో తమ అభిమాన నటుడికి జీవితంలో ఒక్కసారైనా కలవాలని వారు తపించిపోతుంటారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన గంగాధర్ అనే యువకుడు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. అయితే గంగాధర్ ఓ దివ్యాంగుడు. అయినా అభిమాన హీరోను చూడాలన్న ఆశను మాత్రం చంపుకోలేదు. ఈ నేపథ్యంలో తన ఆరాధ్య హీరో కోసం సాహసం చేశాడు. ఏకంగా అమలాపురం నుంచి పాదయాత్ర చేసి హైదరాబాదులోని…