నిన్న కేటీఆర్, మెట్రో ప్యాసింజర్ల కు ఇచ్చిన హామీ ని అమలు చేస్తున్నట్లు ప్రకటించిన హెచ్ఎంఆర్… ప్యాసింజర్ల అభ్యర్థనతో మెట్రో రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది. మెట్రో రైలు సమయం పొడిగించింది. రేపటి నుండి ఉదయం అరుగంటల నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక రాత్రి చివరి రైళ్లు 10.15 కు స్టేషన్ల నుంచి కదులుతాయి. ఉదయం 6 గంటల నుంచి చివరి స్టేషన్ నుంచి ప్రారంభం కానున్న మొదటి మెట్రో.. రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్ నుంచి లాస్ట్ రైలు … 11.15 గంటలకు గమ్య స్థానానికి చేరుకుంటుంది మెట్రో. అయితే మంత్రి కేటీఆర్ సూచనలతో మెట్రో సేవలు పొడిగించారు మెట్రో అధికారులు.