Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడటానికి కష్టపడుతుంటే, ఒక చిన్న చిత్రం మాత్రం సంచలనాలు సృష్టిస్తోంది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘తాయి కిళవి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 51.16 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం రాధికా శరత్ కుమార్ నటన అనడంలో అతిశయోక్తి లేదు. 63 ఏళ్ల వయసులో ఆమె చూపించిన ఎనర్జీ, మాస్ మేనరిజమ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ‘పవునుత్తాయి’ అనే పక్కా ఊర మాస్ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేశారు. తనదైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో థియేటర్లలో ఈలలు వేయిస్తున్నారు. విడుదలైనప్పటి నుండి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం 10 రోజుల్లోనే రూ. 51 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, ఇదే జోరు కొనసాగితే త్వరలోనే ఈ చిన్న సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 2026లో ఇప్పటివరకు విడుదలైన తమిళ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా నిలిచి ఈ చిత్రం రికార్డు సృష్టించింది. స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మాణంలో దర్శకుడు శివకుమార్ మురుగేశన్ అద్భుతమైన మేకింగ్ తో మెప్పించాడు. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ సినిమా మరోసారి నిరూపించింది. భారీ సెట్లు, గ్రాఫిక్స్ కంటే కథలో దమ్ముంటే చాలని ‘తాయి కిళవి’ విజయం చాటి చెబుతోంది.
Also Read
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!