బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురిసాయి.. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.. చెన్నై లాంటి ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు.. అయితే, ఆ అల్పపీడన ప్రభుత్వంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఈ నెల 13వ తేదీన దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో రాగల మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెబుతోంది.