పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు ఇప్పట్లో బ్రేక్ పడే దాఖలాలు కనిపించడం లేదు. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఎలా ఉన్నా… దేశీయ మార్కెట్లో మాత్రం పరుగులు పెడుతున్నాయి. రోజూవారీ ధరల పెంపు కారణంగా పెట్రోల్ ధరలు అడ్డూ, అదుపు లేకుండా పెరిగి సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. శనివారం పెట్రోల్ ధర 36 పైసలు పెరగడంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.36కి చేరింది. అటు…
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను తన భర్త, అతడి కుటుంబసభ్యులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్ధనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని భర్త వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. 2016లో తమ వివాహమైన నాటి నుంచి వేధింపులు కొనసాగుతున్నాయని వాపోయింది. మరోవైపు కులం పేరుతో తన భర్త కుటుంబసభ్యులు దూషిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. Read Also: వైరల్: పెళ్లి వేడుకల్లో అనుకోని అతిథి… జనాల పరుగులు కాగా…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బ్రేక్ వేసింది.. ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది… పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది.. కాగా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద నిర్మిస్తున్నారు. దీనికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది…
ఇండియాలో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 44, 950 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 220 పెరిగి రూ. 49, 040 కి చేరింది. ఇక అటు వెండి ధరలు మాత్రం కాస్త…
రాష్ట్రంలో కొత్తగా 24 గంటల్లో 38,373 నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా మరో 171 కేసులు నమోదయినట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,71,000లకు చేరుకుంది. నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,952కు చేరింది. మహామ్మారి నుంచి నిన్న 208 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,126 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరింది. వచ్చే…
హైదరాబాద్ నగరంలో పోలీసులు గంజాయిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా సిటీ మొత్తం పోలీసులు జల్లెడ పడుతున్నారు. టూవీలర్‌పై వెళ్తున్న కొంతమంది యువకులను ఆపి తనిఖీలు చేస్తున్నారు. యువకుల మొబైల్ చాటింగులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో తమ ప్రైవసీకి పోలీసులు భంగం కలిగిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. నిందితుల కదలికలు, నేరస్థుల అనుచరులపై నిఘా పెట్టేందుకే పలువురి మొబైల్…
వివాహేతర సంబంధాలు.. పచ్చని కాపురాలలో నిప్పులు పోస్తున్నాయి. పరాయివారి మోజులో భార్య/భర్తను గాలికి వదిలేసి తమ సుఖాన్ని చూసుకుంటున్నారు. ఈ వివాహేతర సంబంధాల వలన ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి.. మరికొన్ని కుటుంబాల పరువు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఒక భర్త, భార్యను వదిలి ప్రియురాలితో కాపురం పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య రెడ్ హ్యాండెడ్ గా వారిద్దరిని పట్టుకొని దుమ్ము దులిపింది. భర్త కాలర్ పట్టుకొని చెడామడా వాయించేసింది. కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న…
హైదరాబాద్ నగరంలోని హిమాయత్‌నగర్‌లో మిస్ తెలంగాణ-2018 విజేత హాసిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోషల్ మీడియా లైవ్‌లోనే ఆమె ఈ ఘటనకు పాల్పడగా ఈ వీడియో చూసిన స్నేహితులు అప్రమత్తమై డయల్ 100కు సమాచారం అందించారు. నారాయణగూడ పోలీసులు స్పందించి వెంటనే హిమాయత్ నగర్ రోడ్ నం.6లోని యువతి ఫ్లాట్‌కు చేరుకుని ఆమెను రక్షించారు. ప్రస్తుతం హాసిని హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె క్షేమంగానే ఉందని పోలీసులు తెలిపారు. Read Also: తీవ్రమయిన వెన్నునొప్పితో…
దళితబంధు పథకంపై దాఖలైన నాలుగు పిటిషన్లను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు.. ఎన్నికల కమిషన్ నిర్ణయం విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. హుజురాబాద్‌లో దళితబంధు నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి… వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్నికల కమిషన్ విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోమని.. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి…
హైదరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు… ప్రేమకు నిరాకరించిన యువతిపై విచక్షణారహితంగా దాడి చేసినట్టుగా చెబుతున్నారు.. యువతి ఇంట్లోకి చొరబడి.. అమ్మాయి గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు, మనికట్టు ఇలా.. చాలా చోట్ల గాయపరిచాడు.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వట్టి నాగులపల్లిలో యువతి పై యువకుడి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. యువతి ఇంటికి వచ్చి దాడి చేశాడు ప్రేమ్ సింగ్ అనే యువకుడు.. గొంతు, చేతులు, వెళ్లు, కాళ్లు..…