హైదరాబాద్‌లో దారుణం.. రూ.2వేలు కోసం స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ఫకీర్‌వాడలో దారుణం చోటుచేసుకుంది. కేవలం రూ.2వేలు నగదు కోసం మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి స్నేహితుడినే హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల సోనూ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం ఆరేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చాడు. ముషీరాబాద్‌లో నివాసముంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి స్థానికంగా ఓ మటన్‌షాపులో ఉండే అల్తాఫ్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిద్దరూ స్నేహితులుగా మారారు.
Read Also: పబ్‌జీ గేమ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
అయితే ఓ రోజు సోనూ తన స్నేహితుడు అల్తాఫ్‌కు రూ.2వేలు అప్పుగా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వాళ్లిద్దరూ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో తాను అప్పుగా ఇచ్చిన రూ.2వేలు ఇవ్వాలని అల్తాఫ్‌ను సోనూ అడిగాడు. దీంతో వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త గొడవగా మారింది. అల్తాఫ్ కోపంతో ఊగిపోయాడు. తన మటన్ షాపులోని కత్తితో సోనూపై దాడి చేశాడు. అతడి గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. హత్య అనంతరం నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. కాగా పోలీసులు సోనూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!