మొట్టమొదటి ఫ్యాక్టరీ ఔట్లెట్.. మన 'ముకుంద జ్యువెల్లర్స్'. ఈ నెల 11న(రేపే) హైదరాబాబాద్‌లోని సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కూకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్‌లలో బ్రాంచ్‌లను కలిగి ఉన్న 'ముకుంద జ్యువెల్లర్స్'.. సోమాజిగూడలోని సీఎం క్యాంపస్ ఎదురుగా తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభిస్తోంది.
పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని.. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
హైదరాబాద్‌లో కల్తీ వైన్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళా వద్ద నుంచి 90 కల్తీ వైన్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. లాలాగూడ, విజయపురి కాలనీకి చెందిన గేరాల్డింగ్ మిల్స్ గృహిణిగా గుర్తించారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ డ్రైవ్ వాహనాల తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడింది. ఐదుగురు సభ్యుల ముఠాను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పంతంగి కమలాకర్ శర్మ ప్రచారం చేసినట్లు బాధితులు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని ఎన్ కన్వెషన్ సెంటర్లో 'భారతీయుడు-2' ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు సినిమాలో నటించిన నటులంతా విచ్చేశారు. ఈ వేడుకకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కూడా విచ్చేశారు. ఆయన రాగానే యాంకర్ సుమ స్వాగతం పలికారు. కొందరిని చూస్తేనే మన ముఖాలు నవ్వులు వెల్లివిరస్తాయంటూ బ్రహ్మానందాన్ని ఆహ్వానించారు.
లోకనాయకుడు కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. ఈ భారీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వె్షన్ సెంటర్లో 'భారతీయుడు 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతుంది.