Supreme Court: టెర్రర్ ఫండింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం.. కశ్మీర్ వేర్పాటువాదికి బెయిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ వేర్పాటు వాది షబీర్ అహ్మద్ షాకు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఆరేళ్లు జైలు జీవితం గడిపి షాకు ఊరట లభించినట్లయింది. షబీర్ అహ్మద్ షాపై 2017 కేసు నమోదైంది. కానీ.. జాతీయ దర్యాప్తు సంస్థ 2019లో అరెస్టు చేసింది. కశ్మీర్ ప్రాంతంలో వేర్పాటు కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. బెయిల్ మంజూరుకు ముందు.. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా ఉన్న ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ వాదనలు విన్నది. షా తరఫున వాదించిన న్యాయవాది ఆయనపై మొదట దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన ప్రధాన అభియోగ పత్రంలో పేరు లేదని కోర్టుకు తెలిపారు. తరువాత అదనపు అభియోగ పత్రంలో మాత్రమే నిందితుడిగా చేర్చినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆరు సంవత్సరాలకుపైగా జైలులో ఉన్నారని, కేసులో నాలుగు వందలకుపైగా సాక్షులను విచారించాల్సి ఉన్నందున విచారణ త్వరగా పూర్తయ్యే అవకాశం లేదని కోర్టుకు తెలిపారు. మరోవైపు.. దర్యాప్తు సంస్థ తరఫు లాయర్ ఈ కేసులో షబీర్ అహ్మద్ షా కీలకమని వెల్లడించారు. వాదనలు విన్న కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
READ MORE: US aircraft crash: ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.!
Also Read
ఇంతకు ముందు ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో వాదనలకు వచ్చింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని నిందితుడి తరఫు లాయర్ ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు. అక్కడ బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. నిందితుడిపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలనే అనుమానం వస్తుందని కోర్టు తెలిపింది. అంతేకాదు.. ఇదే తరహా కేసుల్లో షబీర్ అహ్మద్ షాపై ఇరవై నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు కోర్టు వివరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. దీంతో నిందితుడు ఈ సారి దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరుకున్నాడు. ఇరువురి తరఫున వాదనలు విన్న సుప్రీంకోర్టు చివరకు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?