హైదరాబాద్ అబిడ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కామర్షియల్ కంప్లెక్స్ రెనవేషన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తాజ్ మహాల్ హోటల్ పక్కనే ఉన్న బిల్డింగ్లో ఈ ఘటన జరిగింది. అయితే పక్కనే ఒ వెల్డింగ్ షాపు ఉండటంతో.. వెల్డింగ్ చేస్తుండగా నిప్పు రవ్వల వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.
Child Kidnapping: హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెలమండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆడుకుంటున్న చిన్నారిని ఓ దుండగుడు ఆటోలో ఎక్కించుకున్నాడు.
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ఆఫీస్ & ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేసింది. హీరా గ్రూప్ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు వెనుదిరిగి పోయారు. కోట్లకు పైగా నిధులు గోల్ మాల్ జరిగినట్టు ఈడీ గుర్తించింది.
MLA K.V Ramana Reddy: సీఎం రేవంత్ రెడ్డి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఏమీ చేయలేదని ప్రతి పక్షంలో కూర్చో పెట్టారు.. రేవంత్ సర్కార్ ఏమీ చేస్తామో చెప్పకుండా గత ప్రభుత్వాన్నీ విమర్శించడం పనిగా పెట్టుకుంది.
KTR Tweet: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఉద్యోగ క్యాలెండర్’పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు స్పందించారు. ఉద్యోగాలపై ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు.
TG High Court Serious: వీధికుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమాయలకుపై కుక్కల దాడులు, వాటి నియంత్రణ చర్యలపై సమావేశాలు, సూచనలతో సరిపెట్టకుండా సమగ్ర కార్యాచరణ అవసరమని తేల్చిచెప్పింది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అభిమానులు మహి, తల అని పిలుచుకుంటారు. ఎంఎస్ ధోనీ సోషల్ మీడియాలో 'తల ఫర్ ఎ రీజన్'తో ట్రెండ్ అయ్యాడు. ఇందులో మహి అభిమానులది పెద్ద పాత్ర. ఈ సందర్భంగా ఎంఎస్ ధోని మాట్లాడుతూ.. ఏదైనా జరిగినప్పుడు సోషల్ మీడియాలో డిఫెన్స్ చేయడం అభిమానుల ప్రేమ అని చెప్పుకొచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హెచ్చరించారు. నగరంలోని పలు మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆమె వెల్లడించారు.