Dog Attack: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కల దాడిలో కీయన్స్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. వీధి కుక్కలు కీయన్స్ పై దాడి చేసి చెంపకు బలంగా కరవరడంతో తీవ్ర గాయాలుతో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అక్కడ కుదరక పోవడంతో తరువాత కామినేని, నీలపురి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ.. బాలుడు గత 20 రోజులుగా కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుక్కలను గ్రామం నుండి తీసివేయాలంటూ, ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ బాలుడు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీం పట్నం రాయపోల్ గ్రామంలో కుక్క కాటుకు గురై చనిపోయిన ఘటన ఇది రెండవది అని మృతుడి కియన్స్ బాలుడి కుటుంబ సభ్యులు వాపోయారు .
Read also: Jagga Reddy: నేటి పాలకులు కులం,మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు
ఇప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించ లేదని వాపోయారు. ఇప్పుడు మా బాబు చనిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలోనీ పుడమి స్కూల్ లో బాలుడిని విపరీతంగా కరిచిందని.. కుక్క దాడి లో తీవ్ర గాయాలతో కీయన్స్ కు నీలోఫర్ లో ఆసుపత్రిలో 20 రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కలు.. పిల్లలపై దాడులు చేస్తున్నాయని ఆందోళన చేసిన ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కుక్కల దాడి నుండి తమ గ్రామాన్ని కాపాడాలని వేడుకుంటున్నారు. కుటుంబానికి, గ్రామంలో ఇది తీరని లోటని వాపోయారు. మా గ్రామంలో కుక్కల.. అలాగే కోతులు చాలా సంచరిస్తున్నాయి, వాటిని పట్టుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
Hyderabad Crime Update: చాకు నజీర్ తో కలిసి వస్తున్న రియాజ్ పై కాల్పులు.. మరి నజీర్ ఏమైనట్టు..?