KTR: యాభై ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల రాష్ట్ర ప్రజలకు తీరని లోటు ఏర్పడిందన్నారు. హైదరాబాద్ అవసరాల కోసం ఏర్పాటు చేసింది సుంకిశాల ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ మొదలైన రోజుల్లో నల్లగొండ జిల్లా రైతులు అడ్డుకుని పోరాటం చేశారన్నారు. ఆ తరువాత చంద్ర బాబు నాయుడు ప్రభుత్వంలో హైదరాబాద్ కి త్రాగునీరు అందించాలని ఎలిమినేటి మాధవ రెడ్డి పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించారని తెలిపారు. అప్పుడు కూడా రైతులు అడ్డుకున్నారని అన్నారు. హైదరాబాద్ పెరుగుతున్న నగరం.. హైదరాబాద్ కి మంచి నీటి అవసరాలు పెరుగుతున్నాయన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సాగు నీటి కి కావాల్సిన ప్రాజెక్ట్ లు అందించారు. ఆ తరువాత సుంకిశాల అంశాన్ని తీసుకుని తిరిగి ప్రారంభించారన్నారు.
Read also: Dog Attack: కుక్కల దాడిలో మా బాబు చనిపోయాడు.. ప్రభుత్వం చర్యలు తీసుకోదా..?
సాగునీటి కి అడ్డులేకపోవడం చేత ఈ సారి రైతులు కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు. హైదరాబాద్ అవసరాల కోసం సుంకిశాల ప్రాజెక్ట్ స్వయంగా వెళ్లి ఫౌండేషన్ వేసాము. గోదావరి నీళ్ళు డెడ్ స్టోరేజ్ కి చేరి హైదరాబాద్ కి అందకపోయినా ఈ నీళ్ళు సరిపోయేలా ఏర్పాట్లు చేశాం. డిల్లీలో ముంబైలో బెంగుళూర్ లో నీళ్ళ కోసం ట్యాంకర్ల పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. కానీ హైదరాబాద్ లో ఎలాంటి పరిస్థితి లేకుండా చేశాము. మరి యాభై ఏళ్లు హైదరాబాద్ లో నీటికి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు చూపుతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశారు. సీతారామ ప్రజెక్ట్ కూడా కేసీఆర్ నిర్మించారు. కానీ మా ప్రభుత్వం పోయింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వారే నిర్మించినట్లు ప్రారంభించారు. మొన్నటి ఎండా కాలంలో హైదరబాద్ లో నీటి సమస్య తలెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2000 రూపాయలకు ట్యాంకర్లు అందించారు.
Read also: Jagga Reddy: నేటి పాలకులు కులం,మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు
కేసీఆర్ హయంలో ఉచితంగా 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తే రేవంత్ రెడ్డి 2 వేలకు ట్యాంకర్లు అమ్ముతున్నాడు అని ప్రజలు విమర్శించారు. సోషల్ మీడియా లో వచ్చేంత వరకు ప్రభుత్వం ఎందుకు బయటపెట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ప్రాజెక్ట్ నిర్మించే సంస్థ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఈ రోజు సుంకిశాల ప్రాజెక్ట్ విజిటింగ్ కి వెళ్తున్నారన్నారు. అక్కడి నుండే నిజం నిగ్గు తెలే వరకు ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఈ డ్యామేజ్ పై జుడీషియరి ఎంక్వైరీ జరిపించాలన్నారు. మేడి గడ్డ కూలినప్పుడు కేంద్ర సంస్థలు వెంటనే స్పందించాయి. ఇప్పుడు మాత్రం కేంద్ర సంస్థలు స్పందించకపోవడం చూస్తే ఇద్దరు ఒక్కటే అని మరోసారి అర్థం అవుతుంది. ఇది ఒక మూర్ఖపు ప్రభుత్వం. అహంకారంతో ముఖ్యమంత్రి ఉన్నాడు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని వాళ్ళు మోయలేకపోతున్నారు. పరిపాలన మీద రేవంత్ రెడ్డి కి పట్టు లేదన్నారు.
Hyderabad Crime Update: చాకు నజీర్ తో కలిసి వస్తున్న రియాజ్ పై కాల్పులు.. మరి నజీర్ ఏమైనట్టు..?