Fraud Case: వీడు మాములోడు కాదు.. 22 ఏళ్లుగా బ్యాంకు అధికారులకు పంగనామాలు
- పనిచేస్తున్న బ్యాంకుకే టోపీ పెట్టిన కంప్యూటర్ ఆపరేటర్
- వేషం మారుస్తూ పోలీసులకు బురిడీ
- చివరికి స్వామీజీ అవతారం
- ఎట్టకేలకు 22 ఏళ్ల తర్వాత తమిళనాడులో అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud Case: 22 ఏళ్ల క్రితం 50 లక్షల రూపాయలు తీసుకుని బ్యాంకుకు మోసం చేశాడు. ఈ ఘటనలో హైదరాబాద్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అనంతరం.. ఈ కేసు కాస్త సీబీఐకి చేరింది. అప్పటినుంచి నిందితుడి కోసం పోలీసులు గాలించడం మొదలు పెట్టారు. అతని కోసం సీబీఐ దేశవ్యాప్తంగా వెతికింది. అయినా నిందితుడి ఆచూకీ దొరకలేదు. నిందితుడి కోసం లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే.. ఏడు సంవత్సరాల క్రితం నిందితుడు చనిపోయినట్లుగా కోర్టు డిక్లేర్ చేసింది. నిందితుడు పేరు పైన ఉన్న ఆస్తులు మొత్తం కూడా అతని భార్యకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే.. 22 సంవత్సరాల తర్వాత వెతుకుతున్న నిందితుడు చివరికి తమిళనాడులోని మారుమూల గ్రామంలో సీబీఐకి చిక్కాడు. ఒక ప్రైవేటు పడవని మాట్లాడుకొని దాని ద్వారా శ్రీలంకకు వెళ్లి సెటిల్ అవుదామని వెళుతుండగా సీబీఐ వాళ్ళు అతన్ని పట్టుకున్నారు. అయితే 22 సంవత్సరాల పాటు బ్యాంకును మోసం చేసిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు.. ఏం చేశాడు అనే దానిమీద విచారిస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి..
Read Also: CI Harrassment: ఇదే పని సారూ.. ఆస్తికోసం తల్లిదండ్రులకు సీఐ చిత్రహింసలు
Also Read
- IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
- iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- 80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
బ్యాంకుకే మోసం చేసి పారిపోయిన తర్వాత నేరుగా రాజస్థాన్ లో వెళ్లి సెట్ అయ్యాడు. అక్కడ బాబాగా అవతారం ఎత్తడు. ఒక ఆశ్రమాన్ని నడిపాడు. దాంతోపాటు రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్, బీహార్ లో బాబా చాలా సంఘ సేవలు చేశాడు. సీబీఐకి చిక్కకుండా చాలా ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా వందల సెల్ ఫోన్లు మార్చాడు.. వందల సిమ్ కార్డులు మార్చాడు.. వందల కొద్ది మెయిల్స్ అడ్రస్ మార్చాడు.. చివరికి సీబీఐ మాత్రం పట్టుకుంది. బాబాగా అవతారం ఎత్తి తన మొదటి భార్య కుమారుడుతో కొన్నిసార్లు టచ్ లోకి వచ్చాడు. ఇదే 22 సంవత్సరాల క్రితం పారిపోయిన చలపతి రావును పట్టించేందుకు మేజర్లు సీబీఐకి చిక్కింది. ఎస్‌బీఐకి రూ.50 లక్షలు కుచ్చు టోపీ పెట్టి గత రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న వ్యక్తిని ఎట్టకేలకు సీబీఐ పట్టుకుంది. తిరుపతి రావు అలియాస్ బాబా అలియాస్ విధామి నాథ్ బవాను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. చలపతిరావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సమయంలో హైదరాబాద్‌లోని చందూలాల్ బరాదరి బ్రాంచ్‌లో సుమారు 50 లక్షలతో పరారయ్యాడు. సీబీఐ కేసు నమోదు అయిన తర్వాత తనను గుర్తించకుండా ఉండటానికి చలపతి రావు ఒక నగరం నుండి మరొక నగరానికి మారుతూనే ఉన్నాడు. అనేక సందర్భాల్లో గుర్తింపు.. వృత్తిని కూడా మార్చుకున్నాడు.
Read Also: Kanjara Gang: కరుడుగట్టిన కంజర గ్యాంగ్ ఆట కట్టించిన సంగారెడ్డి పోలీసులు
చలపతిరావు ఎలక్ట్రానిక్ షాపుల కొటేషన్లను రూపొందించి.. తన కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ వేతన ధృవీకరణ పత్రాలను సృష్టించి ఆ మొత్తాన్ని దుర్వినియోగం చేశారని సీబీఐ పేర్కొంది. అతడిపై కేసు నమోదు కావడంతో చలపతిరావు పరారయ్యాడు. ‘అరెస్టు నుండి తప్పించుకోవడానికి, రెండు దశాబ్దాలుగా అతను తన పేర్లు, మొబైల్ ఫోన్‌లను మార్చుకున్నాడు. అతను ఎప్పుడూ పరారీలో ఉండేవాడు. నిర్దిష్ట ప్రదేశంలో ఎక్కువసేపు ఉండడని అధికారులు తెలిపారు. అతను కనిపించకుండా పోవడంతో అతని భార్య కమాటిపుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అతను చనిపోయినట్లు ప్రకటించాలని ఆమె సివిల్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. చలపతి సేలం పారిపోయి 2007లో తన పేరును ఎం. వినీత్ కుమార్‌గా మార్చుకుని ఓ మహిళను పెళ్లి చేసుకుని ఆధార్ కార్డు కూడా పొందాడు. మొదటి భార్య కొడుకుతో టచ్‌లో ఉన్నట్లు రెండో భార్య ద్వారా సీబీఐకి సమాచారం అందింది.
అయితే 2014లో అకస్మాత్తుగా సేలం నుంచి పారిపోయి భోపాల్‌కు చేరుకుని లోన్ రికవరీ ఏజెంట్‌గా పనిచేసి ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌కు వెళ్లి పాఠశాలలో పనిచేశాడని అధికారులు తెలిపారు. రుద్రాపూర్‌లో అతడిని అరెస్టు చేసేందుకు దర్యాప్తు బృందం చేరుకోగా, అతను అప్పటికే 2016లో అక్కడి నుంచి పారిపోయాడు. ఈమెయిల్ ఐడీలు, ఆధార్ వివరాల సాయంతో చలపతిరావు ఔరంగాబాద్‌లోని వేరుల్ గ్రామంలోని ఆశ్రమానికి మారాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి మళ్లీ తన పేరును స్వామి విధితాత్మానంద తీర్థగా మార్చుకున్నాడని, ఆధార్ కార్డు కూడా పొందాడని వెల్లడైంది. తదనంతరం అతను విధితాత్మానంద తీర్థగా భరత్‌పూర్ రాజస్థాన్ కి మారాడు. 8 జూలై, 2024 వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అతను భరత్‌పూర్‌ను విడిచిపెట్టి తిరునెల్వేలికి చేరుకుని తన శిష్యులలో ఒకరితో ఉండగా పట్టుబడ్డాడు.. రాజస్థాన్ గుజరాత్ బీహార్లలో స్వామి విధితాత్మానంద తీర్థగా చలామణి అయ్యాడు. అయితే 7 లక్షల రూపాయల నగదును తీసుకొని సేలం దగ్గరలో నుండి చిన్న గ్రామం వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి పడవ మాట్లాడుకొని శ్రీలంకకు వెళ్ళిపోదామని ప్లాన్ చేశాడు. సిబిఐ అధికారులకు వచ్చిన సమాచారంతో స్వామి విధితాత్మానంద తీర్థను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
ట్రెండింగ్
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!