తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. మేం పవర్లోకి వచ్చాక సామాన్యులు సైతం నిరభ్యంతరంగా సచివాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారంటూ జబ్బలు చరుచుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. కానీ... రాష్ట్ర పరిపాలనకు గుండెకాయలాంటి అదే సెక్రటేరియట్లోని పలు పేషీల్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయట. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలోనే ఉద్యోగుల ఆగడాలు శృతిమించిపోతున్నాయని సెక్రటేరియెట్ ఉద్యోగులే వాపోతున్న పరిస్థితి.
Rare Treatment : హైదరాబాద్లోని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. బాల్యంలో ప్రమాదవశాత్తు పురుషాంగాన్ని కోల్పోయిన సోమాలియాకు చెందిన యువకుడికి (20) వైద్యులు అత్యాధునిక పద్ధతులతో కొత్త జీవితం ఇచ్చారు. ఈ సమగ్ర చికిత్స ద్వారా అతడి చేతిపై పురుషాంగాన్ని అభివృద్ధి చేసి, తర్వాత శస్త్రచికిత్స ద్వారా తన శరీరంలోని సహజ స్థితికి అనుసంధానం చేశారు. బాల్యంలో జరిగిన ప్రమాదం చికిత్స పొందిన యువకుడికి నాలుగేళ్ల వయసులో సున్తీ (సర్జికల్ సర్కంసిజన్)…
వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు శాంతించాయి. పసిడి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. గోల్డ్ లవర్స్ కు ఇది ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. శుభకార్యాలకు, వివాహాది కార్యక్రమాలకు పసిడి కొనాలనుకునే వారు మళ్లీ ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుత్తడి ధరలు ఓ రోజు పెరుగుతూ, ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ, మరో రోజు స్థిరంగా కొనసాగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి నేడు హైదరాబాద్ మార్కెట్…
Minister Seethakka : తెలంగాణ రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ పెరుగుతుండటం, అనేక మంది నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు నాయకులు, అనేక మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “ప్రజలు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత…
GHMC : హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న ఘటనపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) సీరియస్ అయింది. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి అనుమతుల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తేలడంతో, సంబంధిత భవనానికి ఇచ్చిన అనుమతులను బల్దియా రద్దు చేసింది. అపార్ట్మెంట్ నిర్మాణంలో సెట్ బ్యాక్ లేకపోవడంతో పాటు, బారికేడింగ్, రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయకుండా సెల్లార్ తవ్వకాలు జరిపినట్టు విచారణలో స్పష్టమైంది. అంతేగాక, ఈ తవ్వకాలు GHMC అధికారుల అనుమతి లేకుండా జరిగినట్టు…
Gannavaram Airport: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో గల గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో హైదరాబాద్ నుంచి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానం వాతావరణంలో వ్యాపించిన దట్టమైన పొగ మంచు కారణంగా అరగంటకు పైనే గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది.
రామ్ చరణ్ హీరోగా ఇటీవల గేమ్ చేంజర్ అనే సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. పెద్ది అనే ప్రచారం జరుగుతోంది కానీ టైటిల్ ఫిక్స్ చేసేదాకా అది నిజమా కాదా అనేది…
తెలంగాణ టెట్ పలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ ఈవీ నరసింహ రెడ్డి విడుదల చేశారు. పేపర్ 1లో 59.48 శాతం, పేపర్ 2లో 31.21 శాతం అర్హత సాధించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఢిల్లీలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.