Hyderabad: ఆన్‌లైన్ గేమ్‌లో బాలికను ట్రాప్.. ఆపై అత్యాచారం
- ఆన్‌లైన్ గేమ్‌లో బాలికను ట్రాప్ చేసిన యువకుడు
- ప్రేమ పేరుతో బాలికను నమ్మించి పూణె యువకుడు మోసం
- స్నాప్‌చాట్‌లో న్యూడ్ ఫొటోలు, వీడియోలు పంపిన బాలిక
- బాలికను బ్లాక్‌మెయిల్ చేసిన యువకుడు ఖష్‌దేవ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలు, యువత ఫోన్లు పట్టారంటే ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడటం ఎక్కువైపోయింది. ఆన్‌లైన్‌లో గేమ్స్‌కు బాగా అలవాటు పడిన యువత.. ఆ ఆటలకు సంబంధించి ఆన్‌లైన్‌లో తెలియని వేరే వారితో పరిచయం చేసుకుని గేమ్స్ ఆడుతున్నారు. అయితే.. ఇలా ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతున్న ఓ బాలిక పాలిట శాపంగా మారింది. ఆన్‌లైన్‌లో గేమ్స్ ద్వారా పరిచయం పెంచుకున్న ఓ వ్యక్తి మాయమాటలతో మోసపోయింది. ఆ బాలికను లొంగదీసుకుని ఆన్‌లైన్‌లో చాటింగ్‌లో స్వీట్ మెస్సేజ్‌లతో ఆమెను ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా.. ఆమె ఫోటోలను తనకు షేర్ చేయాలని కోరాడు. దీంతో ఆ బాలిక తన ఫోటోలను ఆ వ్యక్తికి పంపించింది. ఆమె పంపించిన స్నాప్‌చాట్‌లో న్యూడ్ ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. దీంతో.. తల్లిదండ్రులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బాలికను బ్లాక్‌మెయిల్ చేశాడు యువకుడు ఖష్‌దేవ్. దీంతో.. అతను పూణే నుంచి హైదరాబాద్ వచ్చి తన వాంఛను తీర్చుకుని వెళ్లేవాడు.
TGSRTC : ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
Also Read
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
- Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ప్రాంతానికి చెందిన బాలిక.. 2021లో ఏడో తరగతి చదివే సమయంలో ప్రతిరోజూ సాయంత్రం ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండేది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు. మొదట్లో స్నేహితుల్లా ఉండేవారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా చాట్ చేసుకున్న వారిద్దరూ.. చాట్ చేసే క్రమంలో బాలిక ఫోటోలు షేర్ చేయాల్సిందిగా యువకుడు కోరాడు. దీంతో.. బాలిక నిరాకరించింది. ఆ తర్వాత యువకుడు బాలికను బలవంతం చేయడంతో తన ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. వాటిల్లో కొన్ని న్యూడ్ ఫోటోలు ఉన్నాయి.
Karnataka : తమ్ముడిని చంపి తప్పించుకుందాం అనుకున్నాడు.. కుంభమేళాక పోయివచ్చి దొరికిపోయాడు
దీంతో.. అప్పటి నుంచి ఆ ఫొటోలను ఆమె తల్లిదండ్రులు, బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు యువకుడు. తనను కలవాలని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో గత ఏడాది అక్టోబర్ 6న టోలిచౌకీలోని ఓ పార్కులో కలిసింది. అప్పటి నుంచి ప్రతిరోజూ తనను కలవాల్సిందిగా డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 24న బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా, యువకుడు ఖుష్‌డేవ్ అక్కడికి వచ్చి నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో కలుసుకున్నారు. అంతటితో ఆగకుండా.. మరుసటి రోజు అర్ధరాత్రి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడింది. ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది.. దీంతో ఆమె టీచర్ దృష్టికి తీసుకెళ్లింది. టీచర్ ద్వారా ప్రిన్సిపాల్‌కు, ఆమె ద్వారా తల్లిదండ్రులకు విషయం తెలియడంతో.. ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు ఖుష్‌డేవ్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
-
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!