Gold Rates: బంగారం ధర పెరగడమే తప్పించి తగ్గేదేలే అన్నట్లుగా కొనసాగుతోంది. ముఖ్యంగా గత నెల రోజుల నుంచి జెడ్ స్పీడ్ తో బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. అది ఎంతలా అంటే.. సామాన్యుడు బంగారం పేరు చెబుతానే అబ్బో.. అన్నట్లుగా మారింది పరిస్థితి. ఇక నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఒక తులం బంగారంపై రూ. 330 రూపాయల పెరిగి ఆల్ టైం హై రికార్డును సృష్టించింది.
Read Also: Rekha Gupta: ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..! నేడు ప్రకటించే ఛాన్స్!
ఇక నేడు దేశం మార్కెట్లో గోల్డ్ ధర వివరాలను చూస్తే.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 300 రూపాయల పెరిగి 79,700 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 330 పెరిగి 86,961 ట్రేడ్ అవుతుంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయలు పెరిగి రూ. 65,210 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.87,100 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు ఇలా ఉండగా వెండి ధరలు మాత్రం కాస్త స్థిరంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి వెండి ధరలు ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ బంగారం ధర 1,08,000 గా కొనసాగుతోంది.
Read Also: Prem Kumar : 96 సినిమాకు మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా.?