Wipro: విప్రో కంపెనీ హైదరాబాద్ లో తమ క్యాంపస్ విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పతుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
Kaleshwaram Commission: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అక్రమాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ చంద్రఘోష్ కమిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. ఎంక్వైరీలో భాగంగా ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, అధికారులను కమిషన్ క్వశ్చన్ చేసింది. ఈ క్రమంలోనే ఈరోజు (జనవరి 23) కమిషన్ ఎదట కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు చేపట్టిన ఏజెన్సీ సంస్థల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు.
అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ వార్తపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం చేసింది. బాధ్యులైన వైద్యులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. అక్రమ కిడ్నీ రాకెట్ మార్పిడిపై తెలంగాణ వైద్య మండలి స్పందించి సుమోటోగా స్వీకరించి విచారణ చేయనున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) ప్రకటించింది.
Shocking: కలకాలం తోడుండాల్సిన భర్తే కసాయి మారాడు. భార్యని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనను పూర్తిగా విచారించిన పోలీసులకు విస్తూపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను ముక్కలుముక్కలు నరికి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా డెడ్‌బాడీని కుక్కర్లో ఉడికించాడు. మిగతా శరీర భాగాలను జిల్లెల్లగూడ చందన చెరువులో పారేశాడు.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా పోలీసులు, భద్రతా అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘా వర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గొడవ జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కొత్తగూడెం నేతలకు పోస్టులు ఇవ్వడంపై స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. దీంతో.. కమిటీ గాంధీ ఆసుపత్రికి రానుంది. కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రదారులపై నిజానిజాలు తెలుసుకునేందుకు కమిటీని నియమించింది ప్రభుత్వం.
తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు నియామకం కానున్నారు. అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జస్టిస్ తిరుమల దేవి వచ్చే ఏడాది జూన్ 1 వరకు అదనపు న్యాయమూర్తిగా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయించారు.
హైదరాబాద్ చింతల్‌బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న కూల్చివేతలను దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై మండిపడ్డారు.