Amardeep Kumar: ఫైనాన్షియల్ స్కామ్‌లతో సంబంధం ఉన్న ఫాల్కన్ గ్రూప్ చైర్మన్ అమర్ దీప్ కుమార్ దుబాయ్‌కు పారిపోయాడు. తన అనుచరగణంతో కలిసి ఓ చార్టెడ్ ఫ్లైట్‌లో దేశం విడిచిపెట్టినట్లు సమాచారం. భారత్‌లో డిపాజిట్ల రూపంలో ఏకంగా 1700 కోట్ల రూపాయల భారీ వసూలు చేసిన ఫాల్కన్ గ్రూప్, ఇందులో హైదరాబాద్‌లో మాత్రమే 850 కోట్ల రూపాయలు సేకరించింది. తక్కువ పెట్టుబడి పెట్టి అమెజాన్, బ్రిటానియా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నామని, అధిక వడ్డీ రూపంలో లాభాలు ఇస్తామని ప్రచారం చేసి ప్రజలను ఆకర్షించింది ఫాల్కన్ సంస్థ.
Read Also: MLC Srinivas Reddy: కోడి పందేలుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఎమ్మెల్సీ
అమర్ దీప్ కుమార్ ఇప్పటికే తన భార్యా, పిల్లలను దుబాయ్‌లో సెటిల్ చేశాడు. అంతేకాదు, 14 షెల్ కంపెనీల ద్వారా వసూలు చేసిన మొత్తం డబ్బును విదేశాలకు తరలించాడు. ఈ స్కామ్‌పై పోలీసులు లోకౌట్ నోటీసులు జారీ చేశారు. ఫాల్కన్ గ్రూప్‌లోని 9 మంది డైరెక్టర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మిగతా డైరెక్టర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మోసపోయిన ఇన్వెస్టర్లు తమ డబ్బు తిరిగి వచ్చే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.