డబ్బులు ఈజీగా సంపాదించాలన్న ఆశతో యువత చెడు దారి పడుతున్నారు. ఇంట్లో అమ్మనాన్నలను, లేదంటే స్నేహితులను, మరీ లేదంటే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుని మరీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. అయితే ఈ గేమ్స్‌లో డబ్బులు సంపాదిస్తే సంతోషంగా ఉంటున్నారు. లేదంటే.. తీసుకున్న అప్పులు ఎక్కువై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌తో కొందరు తమ ఆస్తులను కూడా కోల్పోయిన ఘటనలు చూశాం. తాజాగా ఆన్‌లైన్ గేమ్స్‌కు మరో యువకుడు బలయ్యాడు.
MLC Kavitha: తెలంగాణలో కేసీఆర్ను తలవని గుండె లేదు.. ఈ పాలనలో తీవ్ర ఇబ్బందులు
వివరాల్లోకి వెళ్తే.. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి అరవింద్ (23) అనే వ్యక్తి లక్షలు పోగొట్టుకున్నాడు. యువకుడు అరవింద్ డిగ్రీ చదువుతున్నాడు. మాదాపూర్ ఖానామెట్‌లో కుటుంబ సభ్యులతో నివాసముంటున్న అరవింద్.. ఆన్‌లైన్‌లో డబ్బులు పోయాయన్న తల్లిదండ్రుల భయంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. యువకుడి కోసం వెతికిన తల్లిదండ్రులు తనను ఇంటికి తీసుకొచ్చారు. నిన్న రాత్రి కూడా ఆన్‌లైన్‌లో గేమ్‌లో మరో అరవై వేలు పోగొట్టాడు అరవింద్. దీంతో.. మనస్థాపానికి గురై తాను ఉంటున్న గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. గమనించిన యువకుడి తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NTPC Recruitment 2025: కేంద్ర విద్యుత్ సంస్థలో భారీగా జాబ్స్.. నెలకు రూ.55 వేల జీతం