హైదరాబాద్ మధురానగర్‌లో ఓ ప్రియుడు ప్రియురాలి ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం రాత్రి ప్రియుడు సూర్యనారాయణ ప్రియురాలి ఇంటికి వచ్చాడు. ఆమె భర్త ముందే ‘నీ పెళ్లాంని నాకిచ్చేయ్.. బాగా చూసుకుంటాను’ అని అన్నాడు. దీంతో.. ప్రియురాలి భర్త, సూర్యనారాయణకు మధ్య గొడవ జరిగింది. ఇంటి నుంచి ప్రియురాలి భర్త సూర్యనారాయణను గెంటేశాడు. అయినప్పటికీ ఆ రాత్రంతా సూర్యనారాయణ ప్రియురాలి ఇంటి ముందే ఉన్నాడు. తెల్లవారుజామున యూసఫ్‌గూడలోని పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ కొనుక్కొని వచ్చి ప్రియురాలి ఇంటి ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. తీవ్రంగా గాయపడ్డ సూర్యనారాయణను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Read Also: New Ration Cards : ముందు వారికి రేషన్ కార్డులు ఇవ్వండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లోని యాదగిరి నగర్‌లో వైజాగ్‌కి చెందిన భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ జూనియర్ ఆర్టిస్టులుగా పని చేస్తున్నారు. అయితే.. ఆ మహిళకు విశాఖకు చెందిన లారీ డ్రైవర్ సూర్యనారాయణ ఆరేళ్ళ క్రితం పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త పెరగడంతో ఐదు రోజులు క్రితం సూర్య నారాయణ సదరు మహిళ ఇంటికి వచ్చి వాళ్ల ఇంట్లోనే ఉన్నాడు. అంతేకాకుండా.. తన భార్య, కొడుకు, కూతురు తనను పట్టించుకోవడం లేదంటూ వారితో చెప్పుకున్నాడు. ఈ క్రమంలోనే మహిళతో సత్యనారాయణకు చనువు పెరిగింది. దీంతో.. నీ భార్య అంటే తనకు ప్రేమ అని.. ఇద్దరి కలిసి ఉండాలనుకుంటున్నం అని సూర్య నారాయణ మహిళ భర్తతో చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ రాత్రి మహిళ ఇంటి ముందే పడుకున్న సూర్య నారాయణ.. తెల్లవారు జామున పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ సూర్యనారాయణ.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Read Also: Ramzan: ముస్లిం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం