Sand Mafia: హైదరాబాద్‌లో ఇసుక మాఫియా.. పదివేలకు కొని యాభైవేలకు అమ్ముతున్న కేటుగాళ్లు
- హైదరాబాద్‌లో జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా, ఇసుక నిల్వలు, విక్రయం.
- ఇసుక రీచ్‌ల నుంచి 10,000 రూపాయలకు ఒక లారీ ఇసుకను కొనుగోలు
- హైదరాబాద్‌లో 50,000 రూపాయలకు విక్రయాలు.
- నగర శివారులో అధికారికంగా గుర్తించబడని పలుచోట్ల ఇసుక డంప్ యార్డులు.
- అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sand Mafia: హైదరాబాద్‌లో ఇసుక అక్రమ రవాణా, ఇసుక నిల్వలు, విక్రయం జోరుగా సాగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. వివిధ జిల్లాల్లోని ఇసుక రీచ్‌ల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న మాఫియా అరాచకాలు మితిమీరుతున్నాయి. ఈ అక్రమ దందాపై టాస్క్ ఫోర్స్ విభాగం దృష్టి సారించి పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తోంది. జిల్లాలలోని ఇసుక రీచ్‌ల నుంచి లారీల ద్వారా ఇసుకను సరఫరా చేయించుకునే మాఫియా 10,000 రూపాయలకు ఒక లారీ ఇసుకను కొనుగోలు చేస్తోంది. అయితే, అదే ఇసుకను హైదరాబాద్‌లో 50,000 రూపాయలకు విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తోంది. ప్రధానంగా, నది తీర ప్రాంతాలకు డెలివరీ పేరుతో బుక్ చేసుకొని నిజానికి హైదరాబాదులో డంప్ చేస్తోంది.
Read Also: Maharashtra: మహాయుతి కూటమిలో చీలిక.. షిండే ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గింపు
Also Read
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, తాడ్‌బండ్, అలాగే నగర శివారులో పలుచోట్ల ఇసుక డంప్ యార్డులు ఏర్పాటయ్యాయి. ఇవి అధికారికంగా గుర్తించబడని నిల్వ కేంద్రాలుగా మారాయి. టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి ఇసుక అక్రమ నిల్వలను గుర్తించారు. ఇసుక అక్రమ డంపింగ్‌కి పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి, టాస్క్ ఫోర్స్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీలను పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం మొదలైంది. అధికారుల చర్యలతో ఇసుక మాఫియాకు గట్టి ఎదురు దెబ్బ పడే అవకాశం ఉంది.
అక్రమంగా ఇసుక నిల్వలు, రవాణా, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, అవసరమైనట్టయితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిజానికి నిర్మాణ రంగం కోసం ఇసుక అత్యవసరమైన వస్తువు. అయితే దాన్ని అక్రమ మార్గాల్లో నిల్వ చేయడం, అధిక ధరలకు విక్రయించడం సామాన్య ప్రజలపై భారం పెడుతోంది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!