GHMC: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ దాఖలుకు ఈ రోజు (సోమవారం) చివరి రోజుగా ఉంది. ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గత ఆరు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అందులో రెండు నామినేషన్లు భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి చెందిన కార్పొరేటర్లు దాఖలు చేయగా, మిగిలిన రెండు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు.
Read Also: Gold Mines: బంగారు గనిలో ఘోర ప్రమాదం.. 48 మంది దుర్మరణం
నేడు నామినేషన్ దాఖలుకు చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంఐఎం (మజ్లిస్) పార్టీకి చెందిన కార్పొరేటర్లు తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీ నుండి మరికొందరు కార్పొరేటర్లు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తమ మెజారిటీ సంఖ్యా బలం లేదని భావించిన భారతీయ జనతా పార్టీ (BJP) ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుండి ఎలాంటి నామినేషన్లు వచ్చే అవకాశమే లేదు.
GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణకు కనీసం 15 మంది సభ్యులు నామినేషన్స్ దాఖలు చేయాలి. కానీ, ఇప్పటి వరకు కేవలం నాలుగు నామినేషన్లే వచ్చాయి. నేడు మరిన్ని నామినేషన్లు దాఖలైతేనే ఎన్నిక జరగనుంది. లేదంటే, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడే అవకాశముంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.