Chakwadi Nala Break: హైదరాబాద్ మహా నగరంలోని గోషామహాల్ పరిధిలోని చాక్వాడి వద్ద మరోసారి నాలా రోడ్డు కుంగిపోయింది. ఈ నాలా ఇప్పటికే నాలుగు సార్లు కుంగిపోగా.. మంగళవారం రాత్రి మరోసారి కుంగింది.
తెలుగు రాష్ట్రాల్లో మీర్పేట్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. కాగా భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిన్న పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన విషయాలు మీడియాకు తెలిపారు.
దావోస్‌లో రాష్ట్రానికి పెట్టుబడుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ రెడ్డి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడం కోసం దావోస్ వెళ్ళామని అన్నారు.
Experium Eco Park: హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్పీరియం’ పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అద్భుత పార్కును నేడు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రామ్‌దేవ్‌రావు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్కును రూపొందించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరికొంతమంది హాజరయ్యారు. ఈ పార్కులో…
Gold Rates: ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో భారీగా పడిపోయిన బంగారం ధరలు ఆ తర్వాత రోజు రోజుకి పెరుగుతూ మరోసారి 10 గ్రాముల బంగారం ధర 80 వేలకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో అత్యధికంగా 83 వేల వరకు కూడా ధర చేరుకుంది. ఇకపోతే, గత రెండు రోజుల నుంచి బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పడ్డాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల బంగారం ధర 10…
HYDRA: హైదరాబాదులోని అమీన్ పూర్లో మరోసారి హైడ్రా అధికారుల కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతలు అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. పలు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు, చెరువును ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలిన వెంటనే, హైడ్రా కమిషనర్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కూల్చివేతలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. హైడ్రా అధికారులు ఈ కూల్చివేతల సమయంలో ప్రజల…
KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పలు సందర్భాల్లో తెలంగాణ అభివృద్ధిపై.. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి, సైబరాబాద్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చాలా వేదికల్లోనూ ప్రశంసలు కురిపించారు.. తాజాగా, దావోస్ పర్యటనలో ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలో పాల్గొన్న కార్యక్రమంలోనూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందంటూ చంద్రబాబు కీర్తించారు.. ఇక, సోమవారం మీడియా సమావేశంలోనూ మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో…
Road Accident: ఓవర్ స్పీడింగ్ కారణంగా హైదరాబాద్ లోని బహుదూర్ పుర్ నుంచి ఆరంఘర్ వెళ్లే కొత్త ప్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. బహదూర్ పూరాకు చెందిన మైనర్లు మాస్ ఖాద్రీ, మహ్మద్ అహ్మద్, మరో బాలుడు బైక్‌పై ఆరంఘర్ వైపు వెళ్తుండగా శివరాంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. బైక్ అధిక వేగంతో ముందుకు దూసుకుపోవడంతో అదుపు తప్పి ముందుగా ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీ…