ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సొరెన్ తప్పుకున్నారు. కొత్త సీఎంగా చంపై సొరెన్‌ను జేఎంఎం శాసనసభాపక్షం ఎన్నుకుంది. చంపై సొరెన్‌ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నట్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించిన నిమిషాల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అంతకుముందు బుధవారం సాయంత్రం, భూ కుంభకోణంలో ఏడు గంటలకు పైగా ఈడీ ప్రశ్నించడంతో హేమంత్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే ఆయన భార్య కల్పనా సోరెన్ సీఎం అవుతారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. హేమంత్ సోరెన్ కూడా కల్పనా వైపు మొగ్గు చూపారు. కానీ చివరికి ఆ ప్లాన్ రివర్స్ కొట్టింది. కూటమిలో విభేదాలు తలెత్తడంతో సడన్‌గా తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది.
ఝార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు అరెస్ట్ చేస్తారన్న అనుమానంతో హేమంత్ సోరెన్ రాజీనామా చేసినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలంతా చంపై సోరెన్‌ను సీఎంగా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గత వారంలో నెలకొన్న బీహార్ సంక్షోభం ఆదివారంతో ఫుల్ స్టాప్ పడగా.. ఇప్పుడు ఝార్ఖండ్ వంతు వచ్చింది. తాజాగా ఝార్ఖండ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ హాట్‌గా సాగుతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మిస్సింగ్ అయ్యారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. వారం రోజుల క్రితం ఆయన ఢిల్లీలోని అధికార నివాసానికి వచ్చిన తర్వాత హేమంత్ కనిపించకుండపోయారు. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోమవారం ఢిల్లీలోని సీఎం నివాసానికి ఈడీ అధికారులు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. దీంతో…
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడంతో.. రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేలంతా రాంచీకి చేరుకోవడంతో త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలు అందరూ లగేజీలతో సోమవారం రాంచీ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు రాంచీ రావాలని సీఎం హేమంత్ సోరెన్ ఆదేశించారట. తాజా…
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ దాదాపు 18 గంటలుగా కనిపించకుండా పోయారు. ఆయన కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం వేచి చూస్తుంది. అయితే, నిన్న ఢిల్లీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ ఓ బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకుంది.
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం సోమవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి చేరుకుంది. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు చేరుకోగా.. ఆయన తన ఇంట్లో లేరని, ఎక్కడికో వెళ్లారని ఈడీ వర్గాలు వెల్లడించాయి.