Hemant Soren Arrest: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించిన నిమిషాల తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. అంతకుముందు బుధవారం సాయంత్రం, భూ కుంభకోణంలో ఏడు గంటలకు పైగా ఈడీ ప్రశ్నించడంతో హేమంత్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం నాడు ఈడీ విచారణ ముగిసిన కొద్ది క్షణాలకే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. జార్ఖండ్‌లో భూకుంభకోణం విచారణలో భాగంగా సోరెన్‌ను ప్రశ్నించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. జార్ఖండ్ మంత్రి, అధికార సంకీర్ణ ముఖ్యమంత్రిగా ఎంపికైన చంపై సోరెన్ 43 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను గవర్నర్‌కు సమర్పించారు. జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రి చంపై సోరెన్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
Read Also: Jharkhand: కల్పనా సోరెన్ ఎందుకు సీఎం కాలేదంటే..!
మరోవైపు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, తను లేని సమయంలో సోదాలు చేపట్టారని ఫిర్యాదు చేశారు. తన ఇంటి పరిసరాల్లో బ్లూ బీఎమ్‌డబ్లూ కారు, పెద్ద ఎత్తున అక్రమ నగదు లభించాయంటూ అధికారులు మీడియాకు లీకులు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ కారు తనది కాదని, తన వద్ద ఎలాంటి నగదు లేదని చెప్పారు. ప్రజల ముందు తనను అవమానించేందుకు ఈడీ ఈ చర్యలు తీసుకుందని ఆరోపించారు. ఈడీ అధికారుల కారణంగా తను, తన కుటుంబం మానసిక వేదన అనుభవించిందన్న ఆయన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ధృవా పోలీసు స్టేషన్‌లో హేమంత్ సోరెన్ ఫిర్యాదు చేసినట్లు రాంచీ పోలీసులు తెలిపారు.