రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం జార్ఖండ్‌లో కొనసాగుతోంది. సోమవారం రాహుల్ పర్యటన ప్రారంభానికి ముందు మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్.. రాహుల్‌తో భేటీ అయింది.
దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన చీకటి రోజుగా జనవరి 31 మిగిలిపోతుందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
Jharkhand: జార్ఖండ్ రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. హేమంత్ సొరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో చంపై సొరెన్ ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకునేందుకు సోమవారం ‘ఫ్లోర్ టెస్ట్’ ఉంది. దీంతో ఎమ్మెల్యేలంతా ఆదివారం హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరారు.
ఝార్ఖండ్ (Jharkhand) మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు (Hemant Soren) కోర్టులో ఊరట లభించింది. సోమవారం అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు హాజరయ్యేందుకు రాంచీ ప్రత్యేక కోర్టు హేమంత్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన శాసనసభలో జరిగే బలపరీక్షకు హాజరుకానున్నారు.
Hemant Soren: భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ని శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 5 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈ కేసులో కేసులో హేమంత్ సోరెన్‌ను ఏడు గంటలకు పైగా విచారించిన తర్వాత బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, దీనిపై ఆయన ఏక కాలంలో జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు.
మనీలాండరింగ్ కేసులో బుధవారం ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ కోసం 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.
ప్రస్తుతం ఝార్ఖండ్ తీవ్ర రాజకీయ సంక్షోభంపై ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి 23 ఏళ్లు అయింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఇప్పటి వరకు ఆరుగురు ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు.
Hemant Soren Approaches Supreme Court Against ED Arrest: భూ కుంభకోణం కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ.. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టును సవాలు చేస్తూ.. గురువారం హేమంత్ సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు. అత్యవసర విచారణ కోసం భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం…