Farmers Suffering: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అన్నదాత తీవ్రంగా నష్టపోయాడు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, నింపిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.
భారత్ లో రోజు రోజుకు ఎండలు మండుతుంటే.. విదేశాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బ్రెజిల్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనాలు అల్లాడుతున్నారు. దేశంలో పెద్ద ఎత్తున వరదలు పోటెత్తాయి.
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు 33 మంది ప్రాణాలు కోల్పోగా.. 27 మంది గాయపడ్డారు.
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలోని వివిధ ప్రాంతాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Australia: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతంలో వినాశకరమైన వర్షాలు సంభవించాయి. దీని తరువాత వరదలు సంభవించాయి.