బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో… ఏపీలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఆదివారం, సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కవ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. ఓ మోసర్తు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.. దీనికి అల్పపీడనం తోడు…
ఈ రోజు, రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.. నిన్నటి ఝార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనము ఈరోజు తెలంగాణ నుండి దూరంగా వెళ్ళిపోయింది. నైరుతి రుతువనాలు తెలంగాణాపై చురుకుగా కదులుతున్నవని.. ఈ రోజు క్రింది స్థాయి నుండి పశ్చిమ గాలులు బలంగా వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో.. రాగల మూడు రోజులు (15,16,17వ తేదీలు) తేలికపాటి…
కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేసింది.. ఇక, మహారాష్ట్రలో చెప్పాల్సిన పనేలేదు.. అందులో ముంబై ఎదురైన అనుభవం మామూలుదికాదు.. అయితే, ఇప్పుడిప్పుడే కరోనా నుండి తేరుకుంటున్న ముంబై ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో గత రెండు రోజులగా కురిసిన వర్షాలతో ముంబై మొత్తం జలమయమైంది. ఇప్పటికే ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ అధికారులు ప్రజలకు సూచనలు సైతం చేశారు. ఈ క్రమంలో ముంబై వాసులకు ఐఎండీ అలర్ట్ జారీ చేసింది. వచ్చే…
పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షం కురిసింది.. ఉరుములు, మెరుపులతో పిడుగులే కురుస్తున్నాయా? అనే తరహాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాయి.. అంతే కాదు.. ఈ పిడుగు పాటుకు ఒకే రోజు ఏకంగా 20 మంది మృతిచెందగా.. మరికొంతమంది గాయాలపాలయ్యారు.. దక్షిణ బెంగాల్‌లోని కోల్‌కతాతో పాటు పలు జిల్లాల్లో భారీ ఉరుములు, మెరుపులతో ఇవాళ సాయంత్రం వర్షం కురిసింది.. పిడుగుపాటుకు ముర్షిదాబాద్‌లో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. హుగ్లీలో మరో 9 మంది మృతిచెందారు.. ఇక, మిడ్నాపూర్ జిల్లాలో మరో…
ఋతుపవనాలు తెలంగాణా, ఆంధ్రా రాష్ట్రలలో మెదక్, నల్గొండ, రెంటచింతల, శ్రీహరికోట వరకు (నిన్న) 6వ.తేదీన ప్రవేశించినవి. నిన్నటి నైరుతి ఋతుపవనాలు మధ్య ప్రదశ్ నుండి మరత్ వాడ , తెలంగాణ, రాయలసీమ మీదగా ఉత్తర తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడినది. ఈ రోజు ఉపరితల ద్రోణి, మరత్వాడ నుండి ఉత్తరా ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి మి వరకు వ్యాపించింది. అల్పపీడనం సుమారుగా 11వ తేదీన ఉత్తర…
తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు రావడంతో భారీ వర్షం కురుస్తుంది. యాదగిరిగుట్టలో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలోకి వర్షపు నీరు చేరింది. వాన నీటితో యాదాద్రి బాలాలయం చెరువును తలపిస్తోంది. అర్చకులు వర్షపు నీటిలో కూర్చుని పూజలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షం పడటంతో బాలాలయం మునిగిపోయింది. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తుండటంతో తాత్కాలికంగా బాలాలయంలోనే నిత్య పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఓవైపు కరోనా పంజా విసురుతుంటే.. మరోవైపు.. తుఫాన్… కేరళను వెంటాడుతోంది… అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తీవ్రరూపం దాల్చడంతో.. కేరళలో శనివారం ఉదయం నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి… రాష్ట్రంలోని మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, కాసర్‌గోడ్‌తో సహా పలు జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షాపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది ఐఎండీ. దీంతో.. రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్‌ల్లో ఆరెంజ్ అలర్ట్, తిరువనంతపురం,…