Farmers Suffering: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అన్నదాత తీవ్రంగా నష్టపోయాడు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, నింపిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. పండ్లు, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మామిడి కాయలు నేలరాలాయి. ఈదురు గాలులకు పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల పిడుగులు పడి మూగజీవాలు మృత్యువాత పడ్డాయి.
Rea also: Lok Sabha Elections 2024 : పోలింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సులో అగ్ని ప్రమాదం.. ఎక్కడంటే..?
ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోఅకాల వర్షం రైతులను ఆగం చేసింది. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పిడుగుపాటుతో ఇద్దరు రైతులు, గాలి దుమారానికి గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేటలో మార్కెట్ యార్డు, కల్లాల వద్ద వరి ధాన్యం తడిచి ముద్దైంది. భారీ వర్షం రావడంతో వరదలకు పలు చోట్ల కొట్టుకుపోయింది. చెల్లాచెదురైన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతుల అష్ట కష్టాలు పడ్డారు. సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో ఈదురు గాలులకు నేలరాలిన మామిడి, భారీ వృక్షాలు నెలకొరిగాయి.
Read also: Tragedy: మేడ్చల్ లో గోడకూలి ఏడుగురు మృతి.. సికింద్రాబాద్ లో కొట్టుకొచ్చిన మృతదేహాలు..
గాలివానకి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయిలపూర్ నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో బావి వద్దకు వెళ్తుండగా పిడుగుపడి మల్లేశం అనే రైతు మృతి చెందగా.. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం ఎర్రారం గ్రామ శివారులో పిడుగుపడి మరో రైతు మృతిచెందాడు. అయితే.. భారీ వృక్షాలు రోడ్లపై కూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సిద్దిపేట జిల్లా రాయపోల్, మిరుదొడ్డి, కుకునూరుపల్లి, కొండపాక, గజ్వేల్ మండలాల్లో మంగళవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది.
Rea also: Janhvi Kapoor : ఆ రూమర్ పై స్పందించిన దేవర బ్యూటీ..
సిద్దిపేట మార్కెట్ యార్డులో వేసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. పిట్టలగూడెంలో ఈదురు గాలులకు రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. చేర్యాల మండలం వీరన్నపేటలో కమ్మకోలు రాజు రేకుల ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వేమూరు మండలంలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పర్ణశాలలో ఈదురు గాలులకు పలు దుకాణాలు, ఇళ్ల పైకప్పులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే అకాల వర్షానికి రైతన్నలకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి భారీ నష్టం జరిగిందని పంట నీట మునిగిందని వాపోయారు. అధికారులు ఆదుకొవాలని కోరారు.
Tragedy: మేడ్చల్ లో గోడకూలి ఏడుగురు మృతి.. సికింద్రాబాద్ లో కొట్టుకొచ్చిన మృతదేహాలు..