మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా ఇల్లందు సింగరేణి ఏరియాల్లో ఎడ తెరిపిలేని వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గనిలో 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయింది.
బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్ వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా భారీగానే పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకనుంది. దీంతో.. ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. గాలులు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఇప్పటికే.. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొనగా.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి…
మిచౌంగ్ తుఫాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.
బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుఫాన్‌గా మారుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈనెల 4వ తేదీన నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత 8 జిల్లాలకు ముందస్తుగా ఏపీ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.. చెన్నైలో వర్షాలు కురుస్తున్నాయని తెలుస్తుంది.. గత కొన్ని రోజుల క్రితం కురుసిన వర్షాలకు రాష్ట్ర ప్రజలు ఇంకా తేరుకోలేదు.. ఇప్పుడు మళ్ళీ వర్షాల గురించి చెప్పడంతో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చెన్నైతో పాటు పొరుగు జిల్లాల్లో రాత్రిపూట వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.. గురువారం నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తమిళనాడు లోని చెన్నై లో గురువారం నుంచి మూడు…
నేడు, రేపు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్తా తీవ్ర వాయుగుండంగా మారిపోయింది.. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోందని.. విశాఖకు 380 కిలో మీటర్లు, పారాదీప్ కు 480 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ దీఘాకు దక్షిణంగా 630 కిలో మీటర్లు, పశ్చిమ బెంగాల్ కెపురాకు 780 కిలో మీటర్ల దూరంలో కేద్రీకృతం అయిఉన్నట్టు తెలిపింది
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కురవడం వల్ల రోడ్లన్ని జలయమం అవుతున్నాయి.. గత రాత్రి నుంచి చెన్నై తో పాటు 15 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోయంబత్తూరు, తిరువూర్, మధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో మంగళవారం కుండపోత వాన పడింది.. ఈ క్రమంలో ఈ…
బెంగళూరు నగరంలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి రాష్ట్రం లో పలు చోట్ల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. కాగా సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి బెంగళూరు లోని వెస్ట్ డివిజన్ లోని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ ఆయుధశాల గోడ కూలిపోయింది.