Telangana Rains: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న రైతులపై వరుణుడు కూడా కరుణించలేదు. గురువారం ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలన్నీ కొట్టుకుపోయాయి.
ఈరోజు హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆప్ఘనిస్తాన్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదలకు 200 మంది మృతిచెందినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తాలిబన్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
ఆప్ఘనిస్థాన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. భారీ వర్షాలు ఆ దేశాన్ని ముంచెత్తుతున్నాయి. చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 70 మంది మృతి చెందగా.. ఆ విషాదం మరువక ముందే మరో సారి భారీ వర్షాలు కురిశాయి
ఏపీలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వైపు ఎండలతో జనాలు ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు వానలు కాస్తా ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలు, వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలతో ఉపశమనం లభించింది. ప్రధానంగా ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.
Telangana Rains: మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Telangana IMD: తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం వరకు ఎండలు ఉండగా సాయంత్రం వాతావరణం చల్లబడింది.