Tammy Hurricane: శుక్రవారం అర్ధరాత్రి ఫ్రెంచ్ కరేబియన్ ద్వీపం గ్వాడెలోప్‌లో తుఫాను కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. హరికేన్ శనివారం పగటిపూట గ్వాడెలోప్ ద్వీపసమూహం సమీపంలో లేదా దాని మీదుగా వెళుతుందని అలానే దీని మార్గం రాత్రి సమయంలో సమీపంలోని సెయింట్-మార్టిన్ మరియు సెయింట్-బార్తెలెమీ దీవుల నుండి దూరం వెళ్లే అవకాశం ఉందని ఫ్రెంచ్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని కారణంగా భారీ వర్షపాతంతో పాటుగా బలమైన గాలులు వీస్తాయని సూచించింది. గంటకు 120 కిలోమీటర్లు…
కేరళలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. ఈ కారణంగా ఈరోజు అక్కడ విద్యాసంస్థలను మూసివేశారు. కొట్టాయం, వైకోమ్, చంగనస్సేరి తాలూకాల్లోని విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కేవలం నాలుగు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.
గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వడోదర, భరూచ్, నర్మదా, దాహోద్, పంచమహల్, ఆనంద్, గాంధీనగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న 11,900 మందిని షెల్టర్ హోమ్‌లకు తరలించారు. మరో 270 మంది ఒంటరిగా ఉన్న పౌరులను రక్షించారు.
Congo Landslide: కాంగోలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడి 17 మంది చనిపోయారు. కొండచరియలు విరిగిపడటంతో చాలా ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
TS Heavy rains: తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన 200 మందికి పైగా ప్రాణాలను రక్షించింది అక్కడి ప్రభుత్వం.