Remal Cyclone : తుఫాను పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకినప్పటి నుండి, భారతదేశంలోని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలలో చాలా చోట్ల వర్షం కొనసాగుతోంది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో వరదల పరిస్థితి ఏర్పడింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాలు ఎండ తీవ్రతతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. మే 29-30 మధ్య ఎప్పుడైనా రుతుపవనాలు భారత సరిహద్దులోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అంటే రాబోవు 24 గంటల్లో రుతుపవనాలు కేరళకు చేరుకోవచ్చు.
Remal Cyclone : 'రెమాల్' తుఫాను బలహీనపడింది. గత రాత్రి ఈ తుఫాను పశ్చిమ బెంగాల్ తీరాలను తాకింది. అయితే అది తన దూకుడు రూపాన్ని చూపకముందే అక్కడికి చేరుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు అధికారులను అలర్ట్ చేశారు. కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు.
Heavy Rains: తెలంగాణలో రెమాల్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి. దీంతో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కలిపి నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్ తదితర జిల్లాల్లో గాలివాన కురిసింది. వేర్వేరు ఘటనల్లో మొత్తం 14 మంది చనిపోయారు. దీంతో…
నైరుతి బంగాళాఖాతంలో రేపు (బుధవారం) అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈశాన్యంగా పయనించి ఈనెల 24వ తేదీ వరకు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల చివర వరకు తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
నేడు ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో తెలంగాణలో హైదరాబాద్ సహా పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్‌లో మరికాసేపట్లో జడివాన కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ హెచ్చరించింది. రాబోయే 3 గంటల పాటు హైదరాబాద్ లో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వికారాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా… రెండు రోజులుగా కురుస్తున్న వానలతో వరి పంట నీట మునిగింది. మెదక్, సంగారెడ్డి…
తమిళనాడులోని తెన్‌కాసి జిల్లాలో గల ‘కుర్తాళం’ జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. జలపాతంలో పర్యాటకులు స్నానం చేస్తుండగా నీటి ప్రవాహం పెరగడంతో వారంతా కేకలు వేస్తూ పరుగులు తీశారు.