Adani bribery case: సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో కీలక పరిణామం ఎదురైంది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఇతరులపై కొనసాగుతున్న మూడు కేసులను కలుపుతూ న్యూయార్క్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులను ఉమ్మడి విచారణలో కలిపి విచారించాలని కోర్టు తీర్పు చెప్పింది.
Gautam Adani: అదానీ గ్రూప్‌తో పాటు తనపై అమెరికా మోపిన ఆరోపణలపై తొలిసాగారి అదానీ గ్రూప్ చూర్మన్ గౌతమ్ అదానీ ఈ రోజు స్పందించారు. ‘‘ రెండు వారాల క్రితం అదానీ గ్రూప్‌పై అమెరికా ఆరోపణలు ఎదుర్కొన్నాము. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. ప్రతీ దాడి మమ్మల్ని మరింత బలపరుస్తుందని మీకు చెప్పగలను.
దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. లోక్ సభ, రాజ్యసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతునే ఉంది. నాలుగోరోజైన ఈరోజు (నవంబర్ 29) కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక, లోక్‌సభ మధ్యాహ్నం వరకూ వాయిదా పడగా.. రాజ్యసభ ఏకంగా సోమవారాని(డిసెంబర్ 2)కి వాయిదా పడింది.
Adani Group: అదానీ గ్రూప్స్ తో పాటు దాని అనుబంధ కంపెనీలు.. ఒప్పందాల్లో భాగంగా భారత ప్రభుత్వ అధికారులకు భారీ ఎత్తున లంచాలు ఇచ్చారనే ఆరోపణలపై ఆమెరికాలో కేసు నమోదైంది. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్‌కు చెందిన గ్రీన్ ఎనర్జీ ఈరోజు (బుధవారం) రియాక్ట్ అయింది.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు సాగర్ అదానీలపై యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) నోటీసు (సమన్లు) జారీ చేసింది. ఇందులో 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఇరువురిని ఆదేశించింది. సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ పొందడానికి 265 మిలియన్ డాలర్లు (రూ. 2200 కోట్లకు పైగా) లంచం ఇచ్చారనే ఆరోపణలపై ఈ కేసు నమోదైన విషయం తెలిసిందే.
వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్ జీన్ పియర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అదానీ లంచం కేసు మా దృష్టికి వచ్చిందన్నారు. ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, న్యాయశాఖనే సరైన సమాచారం ఇస్తుందన్నారు. ఇక, భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
గౌతమ్ అదానీ.. భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు తెలుస్తుందన్నారు. మోడీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారని ఆయన ఆరోపించారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Adani : అదానీ గ్రూప్ ఛైర్మన్, దేశంలోని రెండవ అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం, మోసం ఆరోపణల కారణంగా అదానీ గ్రూప్ లిస్టెడ్ స్టాక్స్ భారతీయ స్టాక్ మార్కెట్లో భారీగా పతనం అవుతున్నాయి.