Rahul Gandhi: గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు అయింది. న్యూయార్క్ జడ్జి తన ఆదేశాల్లో అరెస్టు వారెంట్ జారీ చేయడంతో.. భారత్ లో రాజకీయంగా తీవ్ర వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. గౌతమ్ అదానీ.. భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు తెలుస్తుందన్నారు. మోడీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారని ఆయన ఆరోపించారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మదహబి పురి బుచ్‌ను సైతం ఈ కేసులో ఎంక్వైరీ చేయాలన్నారు.
Read Also: 8 Sixes Off 8 Balls: క్రికెట్‌లో సంచలనం.. 8 బంతుల్లో 8 సిక్స్‌లు!
కాగా, ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని లోక్ సభలో లేవనెత్తుతాని రాహుల్ గాంధీ వెల్లడించారు. అదానీ నేరాలపై తక్షణమే జేపీసీ విచారణ జరిపించాలన్న డిమాండ్ స్టార్ట్ అయింది. కానీ, భారత ప్రభుత్వం అదానీకి రక్షణగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. ఇక, ఆయనను అరెస్టు చేయడం కాదు.. కానీసం విచారణ కూడా చేయడం జరగదని గ్యారెంటీ ఇస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గౌతమ్ అదానీ ఎందుకు ఈ దేశంలో స్పేచ్ఛగా విహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. 2 వేల కోట్ల కుంభకోణంతో పాటు ఇతర స్కామ్స్ లో ఆయన పాత్ర ఉందని చెప్పినా మోడీ సర్కార్ ఎందుకు అరెస్టు చేయడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Read Also: SaiDurghaTej : మావయ్య నుండి స్పెషల్ గిఫ్ట్ అందుకున్న సాయిదుర్గ తేజ్!
అయితే, దేశంలోని సీఎంలను అరెస్టు చేస్తున్నారు.. కానీ అదానీ మాత్రం పరారీలో అవుతున్నాడని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ అంశాన్ని చాలా రోజుల నుంచి ప్రశ్నిస్తున్నాం.. కానీ, అదానీని ప్రధాని నరేంద్ర మోడీ రక్షిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఈ స్కామ్‌లో నరేంద్ర మోడీ పాత్ర ఉందనే అనుమానం కూడా కలుగుతుందన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అధికారులకు ముడుపులు ఇచ్చేందుకు గౌతమ్ అదానీ ట్రై చేసినట్లు నేరాభియోగం నమోదైంది. ఆ కేసులో అమెరికా కోర్టు అదానీకి అరెస్టు వారెంట్ జారీ చేసింది.