America: గౌతమ్ అదానీతో పాటు ఆయన కంపెనీలపై విచారణ చేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముడుపుల చెల్లింపు కేసులో అమెరికా న్యాయస్థానం అదానీని నిలదీసింది. అయితే, భారతీయ వ్యాపారిపై అమెరికా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్ నేత తీవ్రంగా ఖండించారు. ఎంపిక చేసుకుని ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల.. రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని అతడు పేర్కొన్నాడు. దీనిపై అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ బీ గార్లాండ్‌కు లేఖ రాశారు రిపబ్లికన్ నేత లాన్స్ గూడెన్.
Read Also: AP Education: ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఇంటర్ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు..!
ఇక, విదేశీ వ్యక్తులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అమెరికా కోర్టును రిపబ్లికన్ నేత లాన్స్ గూడెన్ డిమాండ్ చేశారు. అదానీ విచారణ వెనుక ఏదైనా లోగుట్టు ఉందా.. దీని వెనుక జార్జ్ సోరస్ లాంటి వ్యక్తి ఉన్నారా అని ప్రశ్నించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో యూఎస్ కు బలమైన భాగస్వామిగా భారత్ ఉంది.. వారిని టార్గెట్ చేసి చర్యలు తీసుకోవడంతో భాగస్వామ్య కూటమిలో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలోని చెడ్డవారిని అమెరికన్ కోర్టులు శిక్షించాలి.. విదేశీయులను కాదు అన్నాడు. వందల కోట్ల డాలర్లు పెట్టుబడి పెటి, అమెరికన్ల కోసం లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న వారిని టార్గెట్ చేయడం అమెరికాకే నష్టం కలుగుతుందని గూడెన్ ఆ లేఖలో తెలిపారు.
Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత ఎక్కడ ఉంది?
అదానీ సంస్థ భారత్‌లో అక్కడి అధికారులకు లంచాలు ఇస్తే.. అందులో అమెరికా వ్యక్తుల ప్రమేయం లేనప్పుడు.. అతడ్ని విచారించేందుకు న్యాయశాఖ ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తుందో అర్థం కావడం లేదని రిపబ్లికన్ నేత లాన్స్ గూడెన్ తెలిపారు. భారత్ లో అవినీతి జరిగితే, అదానీపై అమెరికాలో కేసు ఎందుకు నమోదు చేశారని కోర్టును నిలదీశాడు. మీరేమైనా ఇండియాలో న్యాయం కోసం ఒత్తిడి తీసుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ కేసులో నిమగ్నమైన అధికారులను అమెరికాకు రప్పించగలరా అని అడిగారు. ఒకవేళ అవినీతి అధికారుల్ని అప్పగించడానికి భారత్ నిరాకరిస్తే.. అప్పుడు యూఎస్ న్యాయశాఖ వద్ద ఎలాంటి ఆప్షన్ ఉందన్నాడు. జో బైడెన్ సర్కార్ పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా, భారత్ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని రిపబ్లికన్ నేత గూడెన్ ఆరోపించాడు.