Gautam Adani: అదానీ గ్రూప్‌తో పాటు తనపై అమెరికా మోపిన ఆరోపణలపై తొలిసాగారి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ రోజు స్పందించారు. ‘‘ రెండు వారాల క్రితం అదానీ గ్రూప్‌పై అమెరికా ఆరోపణలు ఎదుర్కొన్నాము. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. ప్రతీ దాడి మమ్మల్ని మరింత బలపరుస్తుందని మీకు చెప్పగలను. ప్రతీ అవరోధం మరింత ధృడంగా ఉండే అదానీ గ్రూపుకు దాసోహం అవుతుంది’’ అని రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన 51వ జెమ్ అండ్ జువెలరీ అవార్డుల కార్యక్రమంలో అదానీ అన్నారు.
READ ALSO: Kerala: రేప్ కేసులో సంచలన తీర్పు.. సవతి తండ్రికి 141 ఏళ్లు జైలు
‘‘ వాస్తవం ఏంటంటే అనేక రిపోర్టులు ఉన్నప్పటికీ, అదానీ వైపు నుంచి ఎవరూ FCPA ఉల్లంఘన లేదా న్యాయాన్ని అడ్డుకునే కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు మోపబడలేదు. అయినప్పటికీ, నేటి ప్రపంచంలో వాస్తవాల కన్నా అబద్ధాలు వేగంగా వ్యాపిస్తాయి. మనం చట్టపరమైన ప్రక్రియ ద్వారా పనిచేయాలి, ప్రపంచస్తాయి నియంత్రణ పాలన పట్ల మా నిబద్ధతన నేను మళ్లీ ధృవీకరించాలనుకుంటున్నాను” అని అదానీ అన్నారు.అదానీ గ్రూప్ విజయాలు సాధించినప్పటికీ, ఎదుర్కొన్న సవాళ్ల మరింత పెద్దవని ఆయన అన్నారు. ఈ సవాళ్లు మనల్ని విచ్ఛిన్యనం చేయలేవని, ప్రతీ పతనం తర్వాత మరింత పైకి లేస్తామనే నమ్మకాన్ని అందిచాయని చెప్పారు.
రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అదానీ గ్రూప్ భారత ప్రభుత్వ అధికారులకు లంచాలుగా 265 మిలియన్ డాలర్లు చెల్లించిందని ఇటీవల US ప్రాసిక్యూటర్లు ఆరోపించారు.బిలయన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్‌లో ఒక కేసు నమోదైంది. నిధుల సేకరణ కోసం లంచం ఇచ్చేందుకు ట్రై చేశారని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపింది. అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 2 బిలియన్ డాలర్ల లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం 250 మిలియన్ డాలర్లను లంచం ఇచ్చినట్లు అభియోగాలు నమోదైయ్యాయి. అయితే, ఈ ఆరోపణ్ని అదానీ గ్రూప్ ఖండించింది.