Gautam Adani: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ , అదానీ పవర్ వంటి అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తోసిపుచ్చింది. జనవరి 2023లో, అదానీ గ్రూప్ సంస్థల మధ్య డబ్బుల్ని మళ్లించడానికి అడికార్ప్ ఎంటర్‌ప్రైజెస్, మైల్‌స్టోన్ ట్రేడ్‌లింక్స్, రెహ్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి కంపెనీలను ఉపయోగించుకుందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.
Gautam Adani: హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుటుంబం పాల్గొంది. శనివారం పూరీ రథయాత్రలో గౌతమ్ అదానీతో పాటు ఆయన భార్య ప్రతీ అదానీ, కుమారుడు కరణ్ అదానీలు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఊరేగింపుకు సంబంధించిన పూజా ఆచారాలకు వీరు హాజరయ్యారు. ఇదే కాకుండా, ప్రసాదం తయారు చేయడంలో అదానీ కుటుంబం పాలుపంచుకుంది.
ఆపరేషన్ సిందూర్, అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ గుర్తుచేసుకున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌కు శాంతి విలువ ఏంటో తెలుసు అని పేర్కొన్నారు.
Rahul Gandhi: ఇజ్రాయిల్ గూఢచార సంస్థ "మొసాద్" ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిండెన్‌బర్గ్ సంస్థ పలుమార్లు అదానీని లక్ష్యం చేసుకుంటూ సంచలన నివేదికలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికల ఆధారంగా మన దేశంలో ప్రతిపక్షాలు అధికార బీజేపీపై తీవ్ర విమర్శలు చేశాయి. అయితే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాత్ర ఉన్నట్లు మొసాద్ కనుగొంది. రాహుల్ గాంధీ అదానీని లక్ష్యంగా చేసుకుని హిండెన్‌బర్గ్‌తో ‘‘సమన్వయం’’ చేసుకున్నట్లు ఆరోపించింది. కాంగ్రెస్,…
Assam: అస్సాంకు పెట్టుబడుల వరద పారింది. గౌహతిలో జరిగిన అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌లో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ అస్సాంలో ఒక్కొక్కరు రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. ఇద్దరు కలిసి రూ. 1 లక్ష కోట్లను అస్సాంలో పెట్టుబడిగా పెట్టనున్నారు.
IMEC: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఇరు దేశాల సంబంధాలు, రక్షణ, ఇతర అంశాలు చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)’’ ప్రాజెక్టు ఇరువురి మధ్య కీలకంగా మారబోతోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) కు ప్రత్యామ్నాయంగా IMEC ఉండబోతోంది. ఈ ప్రాజెక్టులో బిలియనీర్ అదానీ కీలకంగా ఉన్నారు.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం శుక్రవారం అహ్మదాబాద్ లో జరిగింది. గుజరాతీ సంప్రదాయంలో నిరాడంబరంగా జరిగింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కూతురు దివా జైమిన్ షాను వివాహమాడారు. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సమక్షంలో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ మ్యారేజ్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. కుమారుడి వివాహ వేళ గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ భావోద్వేగానికి లోనయ్యారు. Also…
Maha Kumbh Mela 2025: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) మహాకుంభ మేళాలో (Maha Kumbh Mela) పుణ్యస్నానం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్బంగా ఆయన ఇస్కాన్ శిబిరానికి చేరుకుని భక్తులకు సేవలందించనున్నారు. అదానీ బంద్వాలో హనుమాన్ (Hanuman) ఆలయాన్ని కూడా దర్శించనున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఇస్కాన్ (ISKCON) సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. గౌతమ్ అదానీ మహాకుంభ మేళ ప్రాంతంలో సేవా కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. అదానీ గ్రూప్…
Hindenburg Shutdown: అదానీ గ్రూప్‌ను షేక్ చేస్తున్న అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మూతపడుతోంది. సంచలనాత్మక ఆర్థిక పరిశోధనల శకానికి ముగింపు పలికిన కంపెనీని మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు దాని వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ బుధవారం ప్రకటించారు. హిండెన్‌బర్గ్ వ్యవస్థాపకుడు తన ప్రయాణం, పోరాటాలు, విజయాల గురించి ఎమోషనల్ X పోస్ట్ ద్వారా తెలిపాడు. మేము పని చేస్తున్న ఆలోచనలను పూర్తి చేసిన తర్వాత దాన్ని మూసివేయాలనేది మా ప్రణాళిక అని, ఆ రోజు ఈ…
America: గౌతమ్ అదానీతో పాటు ఆయన కంపెనీలపై విచారణ చేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముడుపుల చెల్లింపు కేసులో అమెరికా న్యాయస్థానం అదానీని నిలదీసింది. అయితే, భారతీయ వ్యాపారిపై అమెరికా కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని రిపబ్లికన్ నేత తీవ్రంగా ఖండించారు.