Gautam Adani: హిందువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పూరీ జగన్నాథుడి రథయాత్రలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కుటుంబం పాల్గొంది. శనివారం పూరీ రథయాత్రలో గౌతమ్ అదానీతో పాటు ఆయన భార్య ప్రతీ అదానీ, కుమారుడు కరణ్ అదానీలు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఊరేగింపుకు సంబంధించిన పూజా ఆచారాలకు వీరు హాజరయ్యారు. ఇదే కాకుండా, ప్రసాదం తయారు చేయడంలో అదానీ కుటుంబం పాలుపంచుకుంది.
Read Also: India Bangladesh: బంగ్లాదేశ్‌ని దారుణంగా శిక్షించిన మోడీ సర్కార్.. ఏం చేసిందంటే..
తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వార్షిక కార్యక్రమానికి వచ్చే యాత్రికులకు, భక్తులకు అదానీ గ్రూప్ సహాయం అందిస్తుంది. పెద్ద ఎత్తున భోజన పంపిణీ, తాగునీరు అందించడం, కార్మికులకు భద్రతా సామాగ్రి, స్థానిక స్వచ్ఛంద సేవల్లో అదానీ ఫౌండేషన్ సహకరిస్తుంది. అదానీ గ్రూప్ ఆహారం, నీటితో పాటు మున్సిపల్ కార్మికులకు ఫ్లోరోసెంట్ దుస్తులు, స్వచ్ఛంద సేవకుల కోసం టీషర్టులు, భద్రతా సిబ్బంది, భక్తుల కోసం జాకెట్లు, టోపీలను, గొడుగులతో సహా రెయిన్ కోట్స్‌ని పంపిణీ చేసింది.
ఈ ఏడాది జరిగిన ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా సందర్భంగా కూడా ఇదే తరహా సహాయ కార్యక్రమాల్లో అదానీ గ్రూప్ పాల్గొంది. ప్రస్తుతం పూరీ కార్యక్రమాల్లో భాగంగా అదానీ గ్రూప్ భక్తులకు, స్వచ్ఛంద సేవలకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు సుమారు నాలుగు మిలియన్ల భోజనం, పానీయాలు అందించాలని భావిస్తోంది. పూరీ అంతటా ఏర్పాటు చేసిన ఆహార కౌంటర్ల ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నారు.