IMEC: ఈ వారం ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ కానున్నారు. అయితే, వీరిద్దరి మధ్య ఇరు దేశాల సంబంధాలు, రక్షణ, ఇతర అంశాలు చర్చకు రాబోతున్నాయి. ముఖ్యంగా ‘‘ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC)’’ ప్రాజెక్టు ఇరువురి మధ్య కీలకంగా మారబోతోంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) కు ప్రత్యామ్నాయంగా IMEC ఉండబోతోంది. ఈ ప్రాజెక్టులో బిలియనీర్ అదానీ కీలకంగా ఉన్నారు.
IMEC ప్రాజెక్ట్ ద్వారా ఇండియాని మిడిల్ ఈస్ట్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్‌తో పాటు యూరప్ దేశాలను కలుపుతుంది. భారతదేశాన్ని నేరుగా యూరప్‌తో అనుసంధానించవచ్చు. చైనా అవలంభిస్తున్న ‘‘రుణ ఉచ్చు’’ విధానానికి పూర్తి విరుద్ధంగా IMEC ప్రాజెక్టు ఉండబోతోంది. ఇటీవల చైనా-ఇరాన్ 400 బిలియన్ డాలర్ల విలువైన వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. ఇది ప్రపంచదేశాల్లో ఆందోళనని రేకెత్తించింది. ఈ భాగస్వామ్యంలో ఇంధనం, వాణిజ్యం, సైనిక రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకుంటాయి. దీంతో ఇప్పుడు ఈ ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కారిడార్ కీలకంగా మారింది.
Read Also: Thummala Nageswara Rao: కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలి.. పార్టీని బ్రతికించుకోవాలి
భారతదేశం, యుఎఇ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మరియు యూరప్‌లను కలిపే 4,500 కిలోమీటర్ల వాణిజ్య మార్గం. సాంప్రదాయ సముద్ర మార్గాలతో పోలిస్తే ఈ కారిడార్ రవాణా సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్టులో ఓడరేవులు, రైలు నెట్వర్క్, ఇంధన ప్రాజెక్టులు నిర్మించబడుతాయి. ఫలితంగా భాగస్వామ్య దేశాలు ప్రయోజనం పొందుతాయి.
ఇటీవల కాలంలో మలక్కా జలసంధి, హార్ముజ్ జలసంధి, బాబ్ ఎల్ మందాబ్ వంటి కీలకమైన సముద్ర చోక్ పాయింట్లు చైనా ప్రభావానికి గురవుతున్నాయని. ఇరాన్ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కు నిధులు సమకూర్చే ఇరాన్ ఇంధన వనరుల్ని చైనా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. ఇది యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులకు ఆయుధాలను సరఫరా చేస్తోంది. వీటిలో కొన్ని చైనాలో తయారుచేయబడివి కూడా ఉన్నట్లు నివేదికలు వస్తున్నాయి.
Read Also: Biren Singh: మణిపూర్ సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా..
IMECలో అదానీ గ్రూప్ పాత్ర:
అదానీ గ్రూప్ ఇంధనం, ఓడరేవులు, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ వంటి వాటిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఈ గ్రూపు భారతదేశ విదేశాంగ విధాన లక్ష్యాలకు దగ్గరగా ఉంది. ఇది చైనా మౌలిక సదుపాయాల ఆధిపత్యాన్ని నేరుగా సవాల్ చేస్తుంది. ఇజ్రాయిల్‌లోని హైఫా పోర్టులో అదానీ గ్రూపుకి 70 శాతం వాటా ఉంది. ఇది భారత్-ఇజ్రాయిల్ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు మధ్యధరా ప్రాంతంలో భారత్ దేశానికి పట్టును పెంచుతుంది.
ఇజ్రాయెల్-భారత్ రక్షణ వాణిజ్యం ఏటా10 బిలియన్ల డాలర్ల లువైనది, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ఈ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. నిజానికి చైనా కంపెనీలను అక్కడి ప్రభుత్వం ఎక్కువగా నియంత్రిస్తుంటుంది. దీనికి విరుద్ధంగా అదానీ ఒక ప్రైవేట్ సంస్థగా స్వతంత్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం అదానీ కంపెనీలు సైనిక డ్రోన్లు, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ రంగాల్లోకి విస్తరిస్తోంది. గతేడాది నవంబర్‌లో యూఎస్ ఎనర్జీ ఇన్‌ఫ్రాలో అదానీ గ్రూపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. దీని వల్ల యూఎస్‌లో 15,000 ఉద్యోగాలు వస్తాయి.