Assam: అస్సాంకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు.. అంబానీ, అదానీ పోటీపడి మరీ ఇన్వెస్ట్‌మెంట్..
- అస్సాం రాష్ట్రానికి పెట్టుబడుల వరద..
- చెరో రూ. 50,000 కోట్ల పెట్టుబడుల్ని పెట్టనున్న అంబానీ, అదానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాంకు పెట్టుబడుల వరద పారింది. గౌహతిలో జరిగిన అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌లో వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దేశంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ అస్సాంలో ఒక్కొక్కరు రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించారు. ఇద్దరు కలిసి రూ. 1 లక్ష కోట్లను అస్సాంలో పెట్టుబడిగా పెట్టనున్నారు.
Read Also: Maha Shivaratri 2025: మహాశివరాత్రి నాడు జాగరణ, ఉపవాసం ఎలాంటి వారు చేయకూడదు?
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
మంగళవారం జరిగిన సదస్సులో అదానీ మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రంలో రూ. 50,000 కోట్ల పెట్టుబడులను పెట్టబోతున్నట్లు చెప్పారు. ఇండియా ఆర్థిక వృద్ధిలో పెట్టుబడిదారుల శిఖరాగ్ర సమావేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ముఖేష్ అంబానీ కూడా రానున్న 5 ఏళ్లలో అస్సాంలో 50,000 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. రాష్ట్రంలో యువత సాంకేతిక, ఇతర రంగాల్లో పురోగమిస్తున్నందున, AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో ‘అస్సాం ఇంటెలిజెన్స్’కు నిలయంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సమ్మి్‌ట్‌కి దేశంలోని అగ్రగామి పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రకారం.. రాష్ట్ర మంత్రి వర్గం ఆదివారం రోజు రూ. 1.22 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఆమోదించింది. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోడీ సోమవారం గౌహతి చేరుకుని, టీ తెగకు చెందిన దాదాపు 9000 మంది కళాకారులు పాల్గొన్న ‘‘ఝుముర్’’ డ్యాన్స్ ప్రదర్శనకు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!