ఓబుళాపురం మైనింగ్ కేసులో తనను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పన్నెండు న్నరేళ్ల కిందట కోర్టు మెట్లేక్కినట్లు చెప్పారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్ల ఎక్కాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకమైన బాధ ఆరోజు కోర్టు మెట్లు ఎక్కినప్పుడు అనుభవించానన్నారు.
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ పాండాతో పాటు మరో ఇద్దరి అరెస్ట్ చేయగా.. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో గత జనవరిలో చోరీ జరిగింది. ఫిల్మ్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మాజీ మంత్రి కొడాలి నానికి శస్త్ర చికిత్స విజయవంతమైంది. ముంబై ఏషియన్ హార్ట్ హాస్పిటల్ లో కొడాలి నానికి సర్జరీ జరిగింది. ప్రముఖ కార్డియాక్ డాక్టర్ పాండ వైద్య బృందం సుమారు 10 గంటలపాటు సర్జరీ నిర్వహించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడి కొడాలి నాని విశ్రాంతి తీసుకున్నారు. మరో మూడు రోజులపాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండనున్నారు.
Khammam Politics : రంజాన్ పర్వదిన సందర్భంగా ఖమ్మం నగరంలోని ఈద్గా మైదానంలో జరిగిన ప్రార్థన జరిగే కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అవమానం ఎదురైంది. రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపేందుకు ముందుగా వచ్చిన మాజీ మంత్రి అజయ్ కుమార్ ఈద్గా మైదానంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సంబంధించిన మైనార్టీ నాయకుడు ఒకరు ఈద్గాలోకి నాన్ ముస్లింలు ఎవరు రాకూడదని నిర్ణయం చేసుకున్నామని వారి కోసం సపరేట్‌గా వేరే వేదిక ఏర్పాటు…
మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎన్‌టీవీతో హరీశ్‌రావు మాట్లాడారు. తమ హయాంలో ఎస్‌ఎల్‌బీసీ కోసం రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి 11 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానన్నారు. తాను చెప్పింది తప్పు అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.
కృష్ణా గోదావరి జలాల్లో వాటాపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "ఉత్తమ్ కుమార్ చెత్త ఆరోపణలతో లాభం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టారు. నాగార్జునసాగర్ , శ్రీశైలం లో నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడడం లేదు. ఇంత నీటి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు తెలంగాణలో తాగునీరుకి కష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
Perni Nani : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికు చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం అక్రమాలు నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు, తమ దర్యాప్తులో సహకరించాలని కోరుతూ, పేర్ని నాని ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో, ఇంటి…
పోలవరం ప్రాజెక్ట్ ఏపీ ప్రజలకు జీవనాడిలాంటిదని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ అన్నారు. మిర్యాలగూడ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.