Perni Nani : మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టులకు పోలీసుల నోటీసులు
- ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల కేసు
- దర్యాప్తులో భాగంగా పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు
- ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ , ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికు చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం అక్రమాలు నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు.
పోలీసులు, తమ దర్యాప్తులో సహకరించాలని కోరుతూ, పేర్ని నాని ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో, ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ , ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ ఉన్నారు.
Also Read
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
పోలీసులు జయసుధ , మానస తేజను త్వరగా హాజరయ్యేందుకు నోటీసులు జారీ చేశారు. వారు మధ్యాహ్నం 2 గంటలలోపు స్టేషన్‌కు వచ్చి వాస్తవాల గురించి వివరించాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని సూచించారు.
Nizamabad: బంగారు నాణేల పేరుతో రూ.7లక్షలు కాజేసిన కేటుగాడు..
ఈ కేసు నేపథ్యంలో, కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం మాయమైందని అధికారులు గుర్తించారు. ఈ కేసులో పేర్ని నాని చిక్కుకున్నారు. వారి సతీమణి జయసుధ , ఆమె పీఏ మానస తేజ కూడా నిందితులుగా ఉన్నారు.
ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో, నాని సతీమణి జయసుధ పేరు మీద గోడౌన్ నిర్మించి, సివిల్ సప్లైస్‌కు అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో, పేదలకు కేటాయించాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. ఈ వ్యవహారం మీద పేర్ని నాని పై అధికార దుర్వినియోగం ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోంది, , పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!